Begin typing your search above and press return to search.

బెనిఫిట్‌ షో టిక్కెట్‌ 5 వేలా??

By:  Tupaki Desk   |   1 July 2015 5:19 AM GMT
బెనిఫిట్‌ షో టిక్కెట్‌ 5 వేలా??
X
సాధారణంగా ప్రతీ పెద్ద స్టార్‌ సినిమాలకూ బెనిఫిట్‌ షోలు వేస్తుంటారు. అయితే ఈ షో ఏదో ఫ్యాన్స్‌ కోసం వేస్తున్నాం అంటే ఇప్పుడు పోలీసులు పర్మిషన్‌ ఇవ్వట్లేదు. కేవలం ఏదైనా చారిటీ కోసం వేస్తున్నాం అంటేనే పర్మిషన్‌ దక్కుతోంది. అందుకే పెద్దస్టార్ల సినిమాలకు హైదరాబాద్‌లో కేవలం ఒకేఒక్క ధియేటర్‌లో బెనిఫిట్‌ షో పడితే ఎక్కువ అన్నట్లుంది సీన్‌.

కాని బాహుబలి విషయంలో మాత్రం ఈ సీన్‌ రివర్స్‌ చేసేలా ఉన్నారట. అసలే 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా. పైగా భారతదేశానికే గర్వకారణమైన సినిమాగా ప్రమోషన్‌ జరుగుతోంది. విజువల్స్‌ చూస్తుంటే కిక్కిస్తున్నాయి. అందుకే ఈ సినిమాను ఎలాగైనా హైదరాబాద్‌లోనే ఓ 15-20 ధియేటర్స్‌లో బెనిఫిట్‌ షో వేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ధియేటర్స్‌లో లోయర్‌ క్లాస్‌ టిక్కెట్స్‌ పరిస్థితి ఏమో కాని.. బెంచీ, బాల్కనీ టిక్కెట్‌ రేటు మాత్రం ఓ నాలుగైదు వేలు ఉండేలా ఉందని తెలుస్తోంది.

ఏంటి.. ఒక్క సినిమా టిక్కెట్‌ ఐదు వేలా? మామూలు అరివీరభయంకరమైన ఫ్యాన్స్‌ ఆ రేంజులో టిక్కెట్‌ ఉన్నా కొంటారు కాని.. మరీ 20 ధియేటర్స్‌లోనూ ఇదే రేంజు టిక్కెట్లు ఉంటే అమ్ముడుపోవేమో. పైగా అంతేసి టిక్కెట్‌ అంటే ముందుగా పోలీసు పర్మిషన్‌ దగ్గర కూడా కాస్త ఇబ్బంది కలగవచ్చేమో అనే ఫీలింగ్‌ ఉంది. చూద్దాం జూలై 9 రాత్రి నుండి జూలై 10 మార్నింగ్‌ షో పడేవరకు ఎన్ని బెనిఫిట్‌షోలు వేస్తారో...