Begin typing your search above and press return to search.

బాహుబలి.. అందరిలో ఒకటే ఉత్కంఠ

By:  Tupaki Desk   |   30 Jun 2015 5:30 PM GMT
బాహుబలి.. అందరిలో ఒకటే ఉత్కంఠ
X
భారతదేశంలోనే ఇంతవరకూ రాని సినిమా. భారీ బడ్జెట్‌ సినిమా..గా బాహుబలి ప్రచారంలోకి వచ్చింది. వందల కోట్ల వ్యాపారం, కోట్లలో వాటాలు ఉన్న సినిమా ఇది. దీనిపై చాలామంది భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఆర్కా మీడియాకి ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకం. ప్రభాస్‌, రానా, రాజమౌళి కెరీర్‌కి ఎంతో కీలకమైన సినిమా. ఈ ఫలితాన్ని బట్టి చాలా డిసైడ్‌ అవుతాయి.

పైగా టాలీవుడ్‌లో తొలి 100కోట్ల సినిమా ఇదే అవుతుందన్న అంచనాలు అస్సలు ఊపిరి సలపనివ్వడం లేదు. జూన్‌ మాసం ముగిసింది. ఇంకా పదిరోజులే గడువు. ఈ పదిరోజులు దర్శకనిర్మాతలకి, టెక్నీషియన్లకి, నటీనటులకు టెన్షన్‌ టెన్షన్‌. ఫిలింమేకర్స్‌కి నరకయాతన. ఇది ఉత్కంఠతో కూడిన యాతన. దీన్ని భరించాలంటే చాలా కష్టం. పంటి బిగువున అన్నిటినీ భరించేయాల్సిందే. అద్భుతాలు ఆవిష్కరించే ఆ రోజుకోసమే అందరి ఎదురు చూపు.

ఉత్కంఠకు తెర వీడాలంటే ప్రీమియర్‌ షో పడాలి. తొలిరోజు మోర్నింగ్‌ షో నుంచి పాజిటివ్‌ రిపోర్ట్‌ రావాలి. కామన్‌ జనాలు ఏమంటున్నారు? పరిశ్రమ వర్గాలు ఏమంటున్నాయి? ఇన్ని విషయాలుంటాయి. దేశ చరిత్రలో మకుటాయమానంగా నిలిచిపోవాలంటే కొండ లాంటి లక్ష్యాన్ని సమర్ధంగా ఢీకొట్టాలంటే బోలెడంత సహనం కావాలి. టెన్షన్‌ని భరించేంత ఓరిమి కావాలి. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఇలా అందరిలోనూ ఇప్పుడున్న టెన్షన్‌ వీడడానికి ఇంకా వారమే గడువు.

ప్రమోషన్‌లో చిత్రయూనిట్‌ హైప్‌ సాధ్యమైనంత తగ్గించడానికే చూస్తోంది. అయినా యూనిట్‌తో పనిలేకుండా జనాల్లో ఒకటే ఉత్కంఠ. బాహుబలి ఫలితం వచ్చే వరకూ ఈ కాస్త సమయం వేచి చూడాల్సిందే.