Begin typing your search above and press return to search.

రాజోలు పాప.. గన్‌ పట్టిన బందిపోటు

By:  Tupaki Desk   |   1 July 2015 1:30 AM GMT
రాజోలు పాప.. గన్‌ పట్టిన బందిపోటు
X
ఒక అందమైన అమ్మాయి, పదిమంది దొంగల ముఠాతో వచ్చింది. హఠాత్తుగా ఓ డబ్బున్న మారాజాపై ఎటాక్‌ చేసింది. అతడి జేబులన్నీ గుల్ల చేసేసింది. వచ్చినంత వేగంతో అక్కణ్ణుంచి మటు మాయమైంది. ఇదేదో హాలీవుడ్‌ సినిమా స్టంట్‌లా ఉందే అనుకుంటున్నారా? సాల్ట్‌లో యాంజెలినా ఎపిసోడ్‌లా అనిపించిందా? కానీ అవేవీ కావు. ఒక తెలుగమ్మాయి చేయబోతున్న స్టంట్‌ ఇది. ఈ యాక్షన్‌ ఫీట్‌ కోన వెంకట్‌ నిర్మిస్తున్న 'శంకరాభరణం' చిత్రంలోనిది.

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగింటి సీతమ్మ, రాజోలు పాప అంజలి కూడా ఓ కీలకపాత్రలో నటిస్తోందని అప్పట్లో హింటిచ్చారు కదా! ఆ హింటుకి ఆన్సర్‌ ఇదే. అంజలి బంధిపోటుగా కనిపించబోతోంది. గన్‌ పాయింట్‌ బ్లాంక్‌లో పెట్టి బెదిరించి డబ్బు సంచులు దోచేసే బంధిపోటు రాణీగా కనిపించబోతోంది. తెరపై కనిపించేది కొద్ది సేపే అయినా అంజలి చెలరేగిపోతుందని చెబుతున్నారు. కోన మైండ్‌లోంచి, అతడి నిజజీవిత అనుభవాల్లోంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్‌ ఇది. అందుకే చాలా షార్ప్‌గా ఉంటుంది. గీతాంజలితో అంజలికి భవిష్యత్‌ని ఇచ్చిన కోన ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కిస్తాడేమో చూడాలి.