Begin typing your search above and press return to search.

ఛీఛీ.. శవంతో సెల్ఫీలు దిగారు

By:  Tupaki Desk   |   4 July 2015 7:30 PM GMT
ఛీఛీ.. శవంతో సెల్ఫీలు దిగారు
X
వేపకాయంత వెర్రి ఉంటే ఫర్వాలేదు కానీ, గుమ్మడి కాయ రేంజుకి అది ఎదిగేస్తే కష్టం. అభిమానం పేరుతో పిచ్చి పరాకాష్టలో ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు మీదికి లంఘించి ఉక్కిరి బిక్కిరి చేసేయడమే కాకాకుండా ఫోటోలు తీసుకుని అందులోనే క్షణికానందం పొందడం అదో రకం ఆనందం. ఇటీవలి కాలంలో సెల్ఫీల పేరుతో ఆ పిచ్చి కాస్తా పరాకాష్టకి చేరుకుంది. ఇప్పుడు అంతకుమించిన హైట్స్‌కి ఎదిగేసింది ఈ వెర్రితనం.

ఈరోజు ట్విట్టర్‌లో బిగ్‌బి అమితాబ్‌ ట్వీట్లు చదివిన ఎవరికైనా ఈ ఘోరకలి ఏంటి మహాప్రభో అనిపించక మానదు. అదేంటో ఆయన మాటల్లోనే విందాం. 'నా క్లోజ్‌ ఫ్రెండ్‌ .. ఈ క్షణం వరకూ నాతో ముచ్చటిస్తున్న స్నేహితుడు .. హఠాత్తుగా చనిపోయాడు. జీవితం క్షణికమైనది. ఆ మరణం నన్ను వేధించింది. హుఠాహుటీన ఢిల్లీ బయల్దేరాను. అక్కడ అతడి అంత్యక్రియల్లో పాల్గొన్నా. అయితే ఆ సందర్భంలో కొందరు సెల్ఫీలు దిగడం కోసం పోటీపడ్డారు. అది నా మనసును తీవ్రంగా కలిచివేసింది. సెల్ఫీలకు అది సందర్భమా? కాస్తయినా ఇంగితం ఉందా? ఓ వైపు చనిపోయిన శవం అంత్యక్రియలకు సిద్ధమవుతుంటే ఇలా వెర్రితనం చూపిస్తారా? అంటూ బిగ్‌బి విచారాన్ని వ్యక్తపరిచారు.

ఎంత అభిమానులు అయినా సమయం, సందర్భం లేకుండా ఇలా శవం సమక్షంలో సెల్ఫీలు దిగడం ఘోరంగా లేదూ?