Begin typing your search above and press return to search.

మహేష్‌తో బన్ని వార్‌ షురూ!!

By:  Tupaki Desk   |   29 Jun 2015 10:30 PM GMT
మహేష్‌తో బన్ని వార్‌ షురూ!!
X
ప్రిన్స్‌ మహేష్‌కి మెగా హీరోల నుంచి ఎప్పటికప్పుడు థ్రెట్‌ ఉండనే ఉంటోంది. ముఖ్యంగా సంక్రాంతి పండక్కి ఘట్టమనేని హీరోతో పోటీపడడానికి ఎవరో ఒక మెగా హీరో రెడీ అవుతూనే ఉన్నారు. ఇన్నాళ్లు మహేష్‌ని చరణ్‌ డీకొట్టాడు. ఇప్పటికే రెండు సంక్రాంతులు ఈ ఇద్దరూ పోటీపడ్డారు. కాని ఇప్పుడు సీన్‌ మారుతోంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (ఎస్‌విఎస్‌సి) వచ్చినప్పుడు నాయక్‌ రిలీజైంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించడం విశేషం. అలాగే 1-నేనొక్కడినేతో ఎవడు పోటీ పడింది. 1 ఫ్లాపైనా ఎవడు భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈసారి రేసులోంచి చరణ్‌ తప్పుకున్నాడు. ఆ స్థానాన్ని బర్తీ చేస్తూ బన్నీ రెడీ అవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ మాస్‌ మసాలా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ జూలైలో ప్రారంభమై, 2016 సంక్రాంతి లక్ష్యంగా తెరకెక్కనుంది. అంటే ఆ మేరకు మహేష్‌ 'బ్రహ్మూెత్సవం'కి పోటీ వెళ్తున్నట్టే. ఈ సినిమాని సంక్రాంతికి వారం ముందు అంటే జనవరి 8 లేదా 9న రిలీజ్‌ చేయనున్నారు. సరిగ్గా పండగ రోజు 14 లేదా 15న బన్ని సినిమా రిలీజవుతుందని ప్లానింగ్‌.

ఆ రకంగా వారం తేడాతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ షురూ అయినట్టే. అయితే మహేష్‌ నటిస్తున్న సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. బన్ని నటిస్తున్నది మాస్‌ ఎంటర్‌టైనర్‌. రెండూ డిఫరెంట్‌ జోనర్స్‌ కాబట్టి ఇవి రెండూ హిట్టెక్కడానికి ఆస్కారం ఉంది. ఎస్‌విఎస్‌సి, నాయక్‌ తరహా ఫలితాన్ని మరోసారి రిపీట్‌ చేసే ఆస్కారం ఉందనుకోవాల్సిందే.