Begin typing your search above and press return to search.

తొలిజల్లు కురవగానే బన్నీ మెదలెడతాడా?

By:  Tupaki Desk   |   24 May 2015 3:30 PM GMT
తొలిజల్లు కురవగానే బన్నీ మెదలెడతాడా?
X
సమ్మర్‌ సీజన్‌ పీక్స్‌లో ఉందిప్పుడు. మే నెల ప్రతాపం ఏంటో మనం చూస్తున్నాం. ఏకంగా 300 మందిని ఇప్పటివరకు ఈ మహమ్మారి ఎండ మింగేసింది. ఇకపోతే మే 30న కేరళను ఋతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే ఓ రెండు వారాల్లో అవి హైదరాబాద్‌ను టచ్‌ చేస్తాయ్‌లే. అలా టచ్‌ చేసిన వెంటనే ఇలా షూటింగులోకి దూకేసేలా ఉన్నాడు స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమా హిట్టయ్యిందనే కాని, ఇంతవరకు తన తదుపరి సినిమాను మొదలెట్టలేదు బన్నీ. ఎవ్వరూ ఊహించని రీతిలో బోయపాటి శ్రీనుతో సినిమాను చేస్తున్న బన్నీ, ఇప్పుడు ఆ కథ ఫైనల్‌ వర్షెన్‌కు ఓకె చెప్పేశాడు. ఇంకేముంది, బోయపాటి కూడా తన మార్కు యాక్షన్‌తో బన్నీమార్కు స్టయిల్‌తో రెచ్చపోవడానికి రెడీ. అయితే షూటింగ్‌కు ఎప్పుడెళ్తున్నారు అనే విషయంపై ఆరాతీస్తే.. మనోళ్ళు జూన్‌ 2వ వారంలో షూట్‌ స్టార్ట్‌ చేస్తారని తెలుస్తోంది.

అంటే సరిగ్గా తొలిజల్లు భాగ్యనగరాన్ని పలకరించి వేడెక్కిన తెలుగు రాష్ట్రాలను కాస్త కూల్‌ చేయగానే వీరు యాక్షన్‌-కట్‌ అంటూ రంగంలోకి దిగుతారనమాట. దాదాపు హీరోలందరూ ఇదే బాటలో పయనిస్తున్నారులే. మరి బన్నీ, ఇది అఫీషియల్‌గా కన్‌ఫామ్‌ చేసుకోవచ్చా నానా?