Begin typing your search above and press return to search.

బన్నీతో గీత.. బ్లాక్‌బస్టర్‌ కావాలి

By:  Tupaki Desk   |   2 July 2015 6:58 AM GMT
బన్నీతో గీత.. బ్లాక్‌బస్టర్‌ కావాలి
X
బన్నీతో గీతకు పడదు! గీతతో బన్నీకి కుదరదు!! అందుకే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ అంతంత మాత్రమే. అసలింతకీ ఈ గీత ఎవరండీ బాబూ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం గీత అంటే గీతా ఆర్ట్స్‌. బన్ని డాడ్‌ అల్లు అరవింద్‌ క్రియేట్‌ చేసిన సక్సెస్‌ఫుల్‌ బ్యానర్‌. ఈ బ్యానర్‌లోనే గంగోత్రి చిత్రంతో బన్ని ఇంట్రడ్యూస్‌ అయ్యాడు.

గంగోత్రి యావరేజ్‌ చిత్రం. ఆ తర్వాత ఇదే బ్యానర్‌లో తెరకెక్కించిన హ్యాపీ, బద్రీనాథ్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌లు మాత్రమే. అంటే గీతా ఆర్ట్స్‌లో బన్ని హీరోగా ఒక్క బ్లాక్‌బస్టర్‌ హిట్టూ లేదు. మరి అలాంటప్పుడు అదే గీతా ఆర్ట్స్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న బన్నీతో సినిమా అంటే జనాల్లో స్పెక్యులేషన్‌ ఎలా ఉంటుంది? బన్నికి సక్సెస్‌ పీక్స్‌లో ఉంది. బోయపాటి సేమ్‌ టు సేమ్‌. కాబట్టి ఈసారి బ్లాక్‌బస్టర్‌ షురూ అనుకుంటున్నారంతా.

గీత రాత మార్చడానికి, ట్రాక్‌ రికార్డ్‌ని తిరగరాయడానికి బోయపాటి వస్తున్నాడు. మాస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు తెరకెక్కించడంలో బోయపాటికి సాటి లేరెవరూ. సింహా, లెజెండ్‌ లాంటి మాస్‌ హిట్స్‌ని బాలయ్యకు అందించిన బోయపాటి ఈసారి బన్నీకి కూడా అలాంటి ఓ హిట్టిస్తాడన్న నమ్మకంతోనే అరవింద్‌ బోయపాటిని ఎంచుకున్నాడు. వీలున్నంత వరకూ ఎక్కువ సమయం తీసుకుని బోయపాటి అండ్‌ టీమ్‌ ఓ మాంచి స్క్రిప్టుని రెడీ చేసి ఆన్‌సెట్స్‌ సందడికి సిద్ధ్దమయ్యారు. కాబట్టి గీత, బన్నిలకు బోయపాటి రూపంలో బ్లాక్‌బస్టర్‌ కొట్టేస్తారేమో. చూద్దాం.