Begin typing your search above and press return to search.

అల్లు చిన్నోడు కూడా పెంచేశాడు

By:  Tupaki Desk   |   23 May 2015 11:18 AM GMT
అల్లు చిన్నోడు కూడా పెంచేశాడు
X
ఈ రోజుల్లో సినిమా సినిమాకు ఏదో ఒక వైవిధ్యం చూపించాలి. కథల్లోనే కాదు.. హీరోల లుక్స్‌ విషయంలోనూ భిన్నంగా ఉంటేనే బండి నడుస్తుంది. అల్లు వారి చిన్నబ్బాయి శిరీష్‌కు టాలీవుడ్‌లో ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి సినిమా 'గౌరవం' మంచి పేరు తీసుకురాకపోగా.. చాలా చెడ్డపేరు తెచ్చిపెట్టింది. 'కొత్త జంట' ఏదో సోసోగా ఆడేసింది కానీ.. శిరీష్‌ ఆశించినంత పెద్ద హిట్టయితే అవ్వలేదు. దీంతో ఈసారి కొట్టాల్సిందే అని కసిగా ఉన్న శిరీష్‌.. దాదాపు ఏడాదిగా లెక్కలేనన్ని స్క్రిప్టులు వింటూ కూర్చుకున్నాడు.

చివరికి యువత, సోలో, సారొచ్చారు లాంటి సినిమాలు తీసిన పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సబ్జెక్టు ఓకే చేశాడు శిరీష్‌. ఐతే తన లుక్‌ విషయంలో ఇంతకుముందు విమర్శలు వచ్చాయి కాబట్టి.. ఈ సినిమాలో డిఫరెంట్‌గా కనిపించాలని ఫిక్సయిన అల్లు చిన్నోడు.. అన్న బన్నీనే స్ఫూర్తిగా తీసుకున్నాడు. కొన్ని నెలలుగా జిమ్‌కే అంకితమైపోయి సిక్స్‌ ప్యాక్‌ పెంచేస్తున్నాడు. ఈ మధ్యే తాను పెంచిన ప్యాక్‌లు చూపిస్తూ ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. బన్నీ పెంచిన ప్యాక్‌లు.. దేశముదురు సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. కానీ ఈ ప్యాక్‌ల వల్లే సినిమా ఆడేయలేదు. మరి శిరీష్‌ చేయబోయే సినిమాలో ఎంత విషయముందో.. అతను పెంచిన ప్యాక్‌లు సినిమాకు ఏమాత్రం ఉపయోగపడతాయో చూద్దాం.