Begin typing your search above and press return to search.

బన్నీ కాస్త ముందు వచ్చుంటే...

By:  Tupaki Desk   |   2 July 2015 1:30 AM GMT
బన్నీ కాస్త ముందు వచ్చుంటే...
X
''మేక్‌ ఏ విష్‌'' ఫౌండేషన్‌. వీళ్ళు డబ్బులేని పేషెంట్లను ఆదుకోవడానికి డబ్బులేమీ ఇవ్వరు. కాకపోతే ఇక బ్రతకరు అనుకున్న వారి కోరికలు మాత్రం తీరుస్తారు. ఎంత పెద్ద సెలబ్రిటీను కలుసుకోవాలని ఉన్నా కూడా వెంటనే కలిపిస్తారు. లేదంటే ఏదైనా ప్రాంతం చూడాలన్నా, ఏదైనా సాహసం చేయాలన్నా.. వారి హెల్త్‌ సహకరించిన దృష్ట్యా వాటిని నెరవేర్చుకోవడానికి హెల్ప్‌ చేస్తారు. ఇక మ్యాటర్‌లోకి వెళదాం.

ఆల్రెడీ మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ ద్వారా క్యాన్సర్‌ ఆఖరి స్టేజీలో ఉన్న ఓ ముగ్గురు చిన్నారులను కలసి బన్నీ వారిలో మనోధైర్యాన్ని నింపాడనే విషయం మనకు తెలసిందే. అయితే మనోడు ఆ మధ్యన ఫారిన్‌ ట్రిప్‌లో ఉన్నప్పుడు ఈ ఫౌండేషన్‌ వాళ్ళు కాల్‌ చేశారట. దానితో వారి కోరికను ఊరి నుండి తిరిగొచ్చాక నెరవేర్చాడు. అయితే మనోడు తిరిగొచ్చేలోపు బన్నీని కలవాలని ఉందంటూ చెప్పిన ఓ నలుగురు చిన్నారుల్లో శ్రీనివాస్‌ అనే పిల్లాడు చనిపోయాడు కూడా. దీని బన్నీ చాలా చింతించాడు. పశ్చ్యాతాపం వ్యక్త పరిచాడు. ఎప్పుడన్నా ఈ ఫౌండేషన్‌ వారు ఫోన్‌ చేస్తే వెంటనే రండి, లేట్‌ చేయకండి అంటూ తన కాంటెంపరరీ సెలబ్రిటీలకు సెలవిచ్చాడు.

నిజానికి బన్నీ కనీసం ఈ విషయం బయటకు చెప్పాడు. చాలామంది సెలబ్రిటీలు ఈ ఫౌండేషన్‌ వారు అడిగిన వెంటనే రాకుండా, ఏదైనా ఖాళీ ఉన్న రోజు చూసుకుందాంలే అంటే డిలే చేస్తున్నారట. మన టాలీవుడే కాస్త బెటర్‌ కాని, బాలీవుడ్‌లో మాత్రం అస్సలు ఇలాంటి కిడ్స్‌ను కలవడానికి స్టార్స్‌ ఇంట్రెస్ట్‌ చూపించట్లేదు. దానితో పాపం కోరిక తీరకుండానే చాలామంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఏం బాసూ.. కాస్త వచ్చి వారి కోరికను తీరిస్తే ఏమైపోతుంది? కోట్లు నష్టమొస్తుందా ఏంటి...