Begin typing your search above and press return to search.

ఆయన ఫోన్‌ చేసినా తీయలేదట!

By:  Tupaki Desk   |   1 July 2015 3:49 PM GMT
ఆయన ఫోన్‌ చేసినా తీయలేదట!
X
అహ్మద్‌ పటేల్‌ అంటే ఎవరు!? సాక్షాత్తూ సోనియా గాంధీయే. సోనియా గాంధీ ఫోన్‌ చేస్తే ఎంతో అహ్మద్‌ పటేల్‌ ఫోన్‌ చేసినా అంతే! యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లూ ఆయనే సోనియా.. సోనియాయే ఆయన! దేశంలోని అతి శక్తిమంతమైన వ్యక్తుల్లో ఆయన ఒకడు! అంతంటి శక్తిమంతమైన వ్యక్తి కారెక్కబోతున్న కాంగ్రెస్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌కు పలుసార్లు ఫోన్‌ చేశారట. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఫోన్‌ చేస్తూనే ఉన్నారట. అయినా, ఆయన ఫోన్‌ను డీఎస్‌ తీయలేదట. ఎంతలో ఎంత విచిత్రం!!

ఒకప్పుడు అహ్మద్‌ పటేల్‌ అపాయింట్‌మెంట్‌ కోసం డీఎస్‌ తదితరులు వెంపర్లాడేవారు. గంటల తరబడి వేచి ఉండేవారు. ఆయన ఎప్పుడు ఎక్కడ అపాయింట్‌మెంట్‌ ఇస్తే అప్పుడు అక్కడికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు డీఎస్‌ కోసం అహ్మద్‌ పటేల్‌ పలుసార్లు ఫోన్లు చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది.

అహ్మద్‌ పటేల్‌ ఫోన్‌ చేసినా డీఎస్‌ సమాధానం ఇవ్వలేదంటే ఒక్క విషయం అర్థమవుతోంది. డి.శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఖాయం. ఇది మాత్రం నిజమని తేలుతోంది.