Begin typing your search above and press return to search.

ప్రతి ఇంటా జరిగేది చూపిస్తాడట

By:  Tupaki Desk   |   3 July 2015 9:30 AM GMT
ప్రతి ఇంటా జరిగేది చూపిస్తాడట
X
ఆది పెళ్లితో ఓ ఇంటివాడయ్యక బొత్తిగా నల్లపూస అయిపోయాడు. అప్పుడప్పుడు హీరోల పెళ్లిళ్లలో మాత్రమే కనిపిస్తున్నాడు. అనవసరంగా టైమ్‌ వేస్ట్‌ చేయకుండా భవిష్యత్‌పై దృష్టి సారించాడు. ప్రస్తుతం ఆది దృష్టంతా సినిమాలపైనే. ఆ ప్రయత్నంలో భాగంగానే గరమ్‌ చిత్రంలో నటించాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్‌ కొట్టాలన్న కసితో వస్తున్నాడు.

త్వరలోనే రిలీజ్‌ సందర్భంగా చిట్‌చాట్‌లో చాలా ఆసక్తికర సంగతులే చెప్పాడు. గరమ్‌ స్టోరీ ప్రతి ఇంట్లో జరిగేదే ఓ ఆసక్తికరమైన టాపిక్‌ చుట్టూ తిరుగుతుంది. ఇదో చక్కని ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. మరీ అంత హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఉండదు కాబట్టి ఈసారి చొక్కా విప్పి 6ప్యాక్‌ చూపించడం లేదు. రెగ్యులర్‌ బోయ్‌లానే కనిపిస్తాను. కథ ప్రకారమే యాక్షన్‌ సన్నివేశాలు వస్తాయి. అదాశర్మ ఈ చిత్రంలో ఓ చక్కని పాత్రలో నటించింది' అని చెప్పాడు. ఈ చిత్రంతో పాటు వీరభద్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఆది కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ కొత్తమ్మాయ్‌ని ఎంపిక చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

చూద్దాం.. ఇప్పటివరకు ఆది బాబుకు ఒక్క హిట్టూ లేదు. సరే పేపర్‌ మీద ఎన్ని హిట్లు ఉన్నా కూడా అసలు జనాల్లో పాపులర్‌ అయ్యేది జెన్యూన్‌ హిట్టు వచ్చినప్పుడే. మరి ఈసారైనా అలాంటిది ఒకటి కొడితే రచ్చ చేయొచ్చు.