Begin typing your search above and press return to search.

రాజధానిలో ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రస్థాయి అకాడమీ!

By:  Tupaki Desk   |   4 July 2015 11:51 AM GMT
రాజధానిలో ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రస్థాయి అకాడమీ!
X
కృష్ణా జిల్లా గన్నవరంలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) రాష్ట్రస్థాయి అకాడమీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోకి వచ్చే జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ ఆవరణలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకుంది.

వాస్తవానికి, జోనల్‌ స్థాయిలో ఆర్టీసీకి అనేక శిక్షణ సంస్థలు ఉంటాయి. వాటన్నిటికీ మార్గదర్శకంగా రాష్ట్రస్థాయిలో ఒక అకాడమీ ఉంటుంది. రాష్ట్రస్థాయి కేడర్‌ కలిగిన అధికారులు, సూపర్‌వైజర్లకు ఇక్కడ వివిధ రకాల శిక్షణలు ఇస్తారు. ఆర్టీసీ పురోభివృద్ధికి సంబంధించి ఉన్నతాధికారులంతా ఇక్కడే మేథో మధనం జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రోడ్డు రవాణాలో వస్తున్న మార్పులు, బస్సులు వాటి పనితీరు, బస్సు ఇంజన్లు, టెక్నాలజీ, అత్యాధునిక మోడళ్లు, టెక్నాలజీ వంటి వాటిపై అధ్యయనం జరుపుతారు.

అంతర్గతంగా ఈ సంస్థ పనితీరు ఎలా ఉన్నా.. నవ్యాంధ్ర రాజధానికి ఒక్కొక్క శాఖలూ తరలి వెళుతున్నాయని, అక్కడ వివిధ సంస్థలు ఏర్పాటవుతున్నాయని చెప్పడానికి దీనిని ఒక ఉదాహరణగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోనే నవ్యాంధ్రకు తరలి పోవాలన్న పట్టుదల కొన్ని శాఖలు, కొంతమంది అధికారుల్లో ఎక్కువగా ఉందని, ఇందులో భాగమే ఆర్టీసీ రాష్ట్రస్థాయి అకాడమీ ఏర్పాటు అని వివరిస్తున్నారు.