Begin typing your search above and press return to search.

ఇళ్ళు కొనడానికి కోట్లు ఎక్కడివో??

By:  Tupaki Desk   |   29 Jun 2015 6:23 PM GMT
ఇళ్ళు కొనడానికి కోట్లు ఎక్కడివో??
X
మన హీరోయిన్లు ఒక రకం. బాలీవుడ్‌ హీరోయిన్లు మరో రకం. అయితే ఈ రకం అంటే ఇందులో డబుల్‌ మీనింగ్‌లు తీసుకోకండి బాబులూ.. ఇక్కడ చాలా తేడా ఉంది. చాలారోజుల నుండి హైదరాబాద్‌లోనే సినిమాలు చేస్తున్న ఇలియానా, కాజల్‌, తమన్నా, సమంతలు ఇక్కడ ఇళ్లు గట్రా కొనుక్కోలేదు. ఎక్కువ వర్క్‌ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు విల్లాలను డూప్లెక్స్‌ ఫ్లాట్స్‌ను అద్దెకు తీసుకున్నారు. నిజానికి ఒక విల్లానే కొనేశంత సీన్‌ మన భామలకు లేదు.

అదే బాలీవుడ్‌లో చూడండి.. పట్టుమని నాలుగైదు సినిమాలు చేసిన భామలు కూడా వెంటనే సొంత కుంపటి పెట్టేస్తారు. ఇంకా చిన్నపిల్లవేగా అని అందరూ అంటున్నా.. ఆలియా భట్‌ అప్పుడే సొంతంగా ఇల్లు కొనుక్కొని అందులోకి ఒక్కత్తే మూవ్‌ అయ్యింది. మొన్ననే పరిణితీ చోప్రా ఏకంగా కరణ్‌ జోహార్‌ ఇంటి ప్రక్క ఫ్లాట్‌ కొనుక్కుంది. ఇప్పుడు తాజాగా సోనమ్‌ కపూర్‌ కూడా అంతే. డూప్లెక్స్‌ అపార్టుమెంటు కొనేసింది. అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రా-కుర్లా మధ్యలో ఈ ఫ్లాట్‌ కొన్నదీ భామ. కనీసం ఒక్కో ఫ్లాట్‌ కాస్ట్‌ 2 కోట్లు ఉంటుందట. ఇక ఇంటీరియర్‌కు ఇంకో కోటి లేస్తుంది. ఇంత డబ్బులు ఈ భామలకు ఎక్కడివి?

అబ్బే స్టన్‌ అవ్వకండి.. ఇక్కడ మన భామలకు బాగా హిట్టయితే సినిమాకు ఓ 50 లక్షలు ఇస్తారు.. అక్కడ సోనమ్‌ వంటి భామలకు అలాగే 2-3 కోట్లు ఇస్తున్నారు. పైగా యాడ్స్‌, ఫోటో షూట్స్‌తో మనోళ్లు బీభత్సంగా సంపాదిస్తారు. ఎలా చూసుకున్నా సంవత్సరానికి మన టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ వంటి భామలు 1 కోటి వెనకేస్తే.. వీళ్లు 5 కోట్లు వరకు వెనకేస్తున్నారు. మరి అపార్టుమెంటులేంటి.. ఏదైనా కొంటారు.