Begin typing your search above and press return to search.

పీవీ సింధు పాత్రకు సూటయ్యే హీరోయిన్ ఎవరు?

By:  Tupaki Desk   |   19 Nov 2017 10:17 AM GMT
పీవీ సింధు పాత్రకు సూటయ్యే హీరోయిన్ ఎవరు?
X
బ్యాడ్మింటన్లో భారత్ కు అంతర్జాతీయ పతకాలు తెచ్చిన సైనా నెహ్వాల్, పీవీ సింధుల కోచ్ పుల్లెల గోపీచంద్‌ పై తీస్తున్న బయోపిక్‌ లో స్టార్ షట్లర్ పీవీ సింధు పాత్ర ఎవరు పోషిస్తున్నారనే విషయంలో టాలీవుడ్‌లో ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే గోపీచంద్ పాత్రకు నటుడిని ఎంపిక చేయడంతో సింధు పాత్రకు కూడా నటిని నిర్ణయించారని, ప్రముఖ హీరోయిన్ ఒకరు ఆమె పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

పదేళ్ల తరువాత రాజశేఖర్‌ కు గరుడవేగ సినిమాతో సూపర్ హిట్ కొట్టించడంతో పాటు దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్ పాత్రలో మహేశ్‌ బాబుకు బావ అయిన సుధీర్‌ బాబు నటించనున్నారు. కాగా హిందీ, తెలుగులో రిలీజ్ చేయనున్న ఈ సినిమా కోసం ప్రవీణ్ సత్తారు ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సింధు పాత్రకు నటిని కన్ఫర్మ్ చేయగానే చిత్రీకరణ కూడా త్వరలోనే మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ కూడా వేగంగా ముగించేలా ప్రవీణ్ సత్తారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు.

కాగా పీవీ సింధు పొడగరి కావడం.. ఆమెలా అథ్టెటిక్ బాడీ ఉన్న హీరోయిన్లు టాలీవుడ్‌లో కొద్ది మందే ఉండడంతో ఆచితూచి నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ లేదా రెజీనాను సింధు పాత్రలో చూస్తామని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే... రకుల్ ప్రీత్ పేరు బలంగా వినిపిస్తోంది.