Begin typing your search above and press return to search.

ఇంత గొప్పగా వర్మ కాక ఇంకెవరు?

By:  Tupaki Desk   |   13 Jun 2018 6:45 AM GMT
ఇంత గొప్పగా వర్మ కాక ఇంకెవరు?
X
ఏ అంశాన్ని ఎక్స్ ట్రీమ్ లెవెల్ కు తీసుకెళ్లిపోవడం.. వర్ణించడం వంటివి రాంగోపాల్ వర్మకు మాత్రమే సాధ్యమైన అంశం. వర్ణన చాలామంది చేస్తారు కానీ.. వర్మ స్థాయిలో మాత్రం ఎవరికీ సాధ్యం కాదనే విషయం.. ఇప్పుడు వర్మ చేసిన ఓ పోస్ట్ తో మరోసారి ప్రూవ్ అయింది.

ఓ కారుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్. ఈ వీడియోలో ఓ తెల్లని కారు రోడ్డుపై ఆగి మెల్లగా పక్కనే ఉన్న రోడ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వైనం కనిపిస్తుంది. కానీ హైవే కావడంతో.. వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనాలు తడబతాయి. ఓ పెద్ద లారీ అయితే.. ఈ కారు పక్క నుంచి వెళ్లి పడిపోతుంది కూడా. మరో లారీ పక్కకు తిరిగి ఆగిపోతుంది. హైవే పై ఇంత హంగామా జరిగినా.. ఆ కారుకు కొంచెం కూడా డ్యామేజ్ కాదు. ఇదే వీడియోను రితేష్ దేశ్ ముఖ్ పోస్ట్ చేస్తే.. దానికి వర్మ వర్ణన సూపర్బ్ గా ఉంది.

'రితేష్ జీ.. ఆ వైట్ కారును చూస్తే ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా.. ఎలాంటి ఎజెండా లేకుండా.. రోడ్డు మీద విపరీతమైన రచ్చ చేస్తున్న ఓ అందమైన అమ్మాయి మాదిరిగా కనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు రాంగోపాల్ వర్మ. యాక్సిడెంట్స్ కు కారణం అయిన అమ్మాయిని.. ఇలా వర్ణించడం మరి ఇంకెవరికి అయినా సాధ్యమా చెప్పండి?

వీడియో కోసం క్లిక్ చేయండి