Begin typing your search above and press return to search.

వినాయక్ రేసు నుంచి తప్పుకున్నట్లేనా?

By:  Tupaki Desk   |   30 July 2015 6:21 PM GMT
వినాయక్ రేసు నుంచి తప్పుకున్నట్లేనా?
X
కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు.. ఈ ప్రశ్నకు వచ్చే ఏడాది ఈ సమయానికి సమాధానం దొరికిపోతుంది. కానీ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. దానికి డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నకు సంబంధించిన సస్పెన్స్ మాత్రం ఎప్పుడు వీడుతుందో అర్థం కావడం లేదు. ఈ ప్రశ్న ఐదారేళ్ల ముందు మొదలై.. ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. ఆ మధ్య పూరి జగన్నాథ్ కన్ఫమ్ అని రామ్ చరణే చెప్పినా.. మళ్లీ ఇప్పుడు సస్పెన్స్ నడుస్తోంది. పూరి కథ, అతడి పనితీరు పట్ల చిరు సంతృప్తిగా లేడని.. వి.వి.వినాయక్ తో డిస్కషన్స్ నడుస్తున్నాయని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పూరికి హ్యాండ్ ఇచ్చేసి చిన్నికృష్ణ కథతో వినాయక్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టొచ్చని అన్నారు.

కానీ వినాయక్ తో డిస్కషన్స్ జరిగిన మాట వాస్తవమే కానీ.. అతను చిరంజీవి 150వ సినిమాను డైరెక్ట్ చేయడం లేదని తేలిపోయింది. ఎందుకంటే వినాయక్ వేరే ప్రాజెక్టులోకి దిగుతున్న సంగతి ఖరారైంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో ‘లోఫర్’ సినిమా తీస్తున్న సి.కళ్యాణ్ కు వినాయక్ ఓ సినిమా కమిటైపోయాడు. అది ఇంకో రెండు నెలల్లో మొదలవబోతున్నట్లు కళ్యాణ్ స్వయంగా వెల్లడించాడు. పూరి సినిమా పూర్తవగానే తమ బేనర్లో వినాయక్ సినిమా ఉంటుందని కళ్యాణ్ చెప్పాడు. ఐతే అందులో హీరో హీరోయిన్లు ఎవరన్నది వెల్లడించలేదు. ప్రస్తుతం అఖిల్ తో సినిమా చేస్తున్న వినాయక్ ఇంకో రెండు నెలల్లో ఫ్రీ అయిపోతాడు. ఆ సమయానికి పూరి-కళ్యాణ్ సినిమా కూడా పూర్తవుతుంది. వెంటనే కొత్త సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. కాబట్టి చిరు, వినాయక్ కాంబినేషన్ ఇప్పట్లో లేనట్లే.