Begin typing your search above and press return to search.

కామెడీ చేసే అమ్మాయిలో ఈ యాంగిలా..

By:  Tupaki Desk   |   19 Nov 2017 11:15 AM GMT
కామెడీ చేసే అమ్మాయిలో ఈ యాంగిలా..
X
తమిళ కమెడియన్ విద్యుల్లేఖను చూడగానే నవ్వొచ్చేస్తుంది. అందుకు ఆమె బబ్లీ అవతారం కూడా ఒక కారణం. ఆమె మీద నడిచే కామెడీ కూడా లుక్ చుట్టూనే ఉంటుంది. ఐతే తన లుక్ విషయంలో విద్యుల్లేఖ ఎప్పుడూ ఫీలవదు. లావుగా ఉండటంలోనూ సెక్సీనెస్ ఉందని ఆమె అంటుంది. ఈ ఉద్దేశాన్ని చాటడానికే ఆమె తాజాగా ఒక హాట్ హాట్ ఫొటో షూట్ కూడా చేసింది. క్లీవేజ్ షోలు చూస్తే ఆ షూట్లో రెచ్చిపోయింది. కామెడీ చేసే వాళ్లు సెక్సీగా ఉండరని జనాలు అనుకుంటారని.. కానీ తాను మాత్రం అలా కనిపించగలనని చాటడానికే ఈ షూట్ చేశానని విద్యుల్లేఖ చెప్పింది.

ఈ షూట్ తాలూకు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగానే చర్చనీయాంశం అవుతున్నాయి. ఐతే విద్యుల్లేఖ ఆత్మవిశ్వాసానికి అభినందనలు చెప్పాల్సిందే కానీ.. కొంచెం వెయిట్ తగ్గి స్లిమ్ గా తయారైతే ఆమె సెక్సీనెస్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఊరికే క్యాజువల్ గా ఈ షూట్ చేస్తే ఓకే కానీ.. హీరోయిన్ కావడమో.. గ్లామర్ టచ్ ఉన్న పాత్రలో ఆశిస్తుంటే మాత్రం విద్యుల్లేఖ అదనపు కేలరీల్ని కొంచెం తగ్గించుకోవాల్సిందే.