'ఎన్టీఆర్' గురించి విద్యా ఆసక్తికర కామెంట్స్

Tue Jan 01 2019 16:29:38 GMT+0530 (IST)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ టాలీవుడ్ లోకి ‘ఎన్టీఆర్’ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్నో గొప్ప హిందీ చిత్రాల్లో నటించి పలు అవార్డులు రివార్డులు అందుకున్న విద్యాబాలన్ ను తెలుగులో నటింపజేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే విద్యాబాలన్ మాత్రం తెలుగులో వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను సున్నితంగా తిరష్కరిస్తూ వచ్చింది. ‘ఎన్టీఆర్’ చిత్రంలోని బసవతారకం పాత్రను మాత్రం ఆమె కాదనలేక పోయిందట.కొత్త సంవత్సరం సందర్బంగా విద్యాబాలన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్’ సినీ విశేషాలను పంచుకుంది. నాకు 9 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో హైదరాబాద్ వేసవి విడిదికి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ గారి గురించి విన్నాను. తెలుగులో పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. కాని ఏది కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా అనిపించలేదు. ‘ఎన్టీఆర్’ సినిమా నాకు తెలుగులో మంచి బిగినింగ్ ను ఇస్తుందని భావిస్తున్నాను. నిర్మాత విష్ణు ఇందూరి నన్ను కలిసి బాలకృష్ణ గారితో ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరారు. ఆయనతో మాట్లాడిన తర్వాత వెంటనే ఈ సినిమాకు ఒప్పేసుకున్నాను.

‘ఎన్టీఆర్’ చిత్రంలో బసవతారకం పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్రకు సంబంధించిన ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. దర్శకుడు క్రిష్ చిత్రీకరణకు ముందు రోజు వాట్సప్ ద్వారా తెలుగు డైలాగ్స్ ను నాకు పంపించేవారు. అందువల్ల నటనపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఏర్పడినది. బాలకృష్ణ గారు తన తండ్రిని ఎంతగా అభిమానిస్తారో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు తెలిసింది ఆయన ఒక గొప్ప నటుడిగా ఈ చిత్రంతో నిరూపితం కాబోతుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుందని చెప్పుకొచ్చింది. ‘ఎన్టీఆర్’ రెండు పార్ట్ లలో కూడా విద్యాబాలన్ చాలా కీలకంగా కనిపించబోతుంది. కథ ఆమె కేంద్రంగా నడుస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది.