Begin typing your search above and press return to search.

ప్రేమికుల రోజును వదిలేసారు

By:  Tupaki Desk   |   12 Feb 2019 5:30 PM GMT
ప్రేమికుల రోజును వదిలేసారు
X
ఏదైనా సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ చాలా ముఖ్యం. క్లాష్ రాకుండా వీలైనంత హైప్ వచ్చేలా చేసుకోవడం దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఇది బాలన్స్ తప్పినప్పుడే ఒకేరోజు రెండు మూడు సినిమాలు రావడం ఒకదాని మీద మరొకటి ప్రభావితం చెంది ఇద్దరూ నష్టపోవడం లేదా ఎవరో ఒకరు లాభ పడటం చూస్తూనే ఉన్నాం. అయితే అనుకూలంగా ఏ పోటీ లేని మంచి తేదీలను మనవాళ్ళు వదిలేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే.

ఎల్లుండి ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న తెలుగులో చెప్పుకోదగ్గ స్ట్రెయిట్ సినిమా ఏదీ రావడం లేదు. కార్తీ దేవ్-ప్రియా ప్రకాష్ వారియర్ లవర్స్ డే రెండూ డబ్బింగులే. ఉన్నంతలో కార్తీ మూవీ కాబట్టి దేవ్ కు కాస్త ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. లవర్స్ డే టాక్ బాగా వస్తేనే నిలదొక్కుకుంటుంది. కేవలం కన్నుగీటు సుందరిని చూసేందుకే జనం థియేటర్ల వద్దకు పరిగెత్తే సీన్ లేదు. సో పోటీ ఈ రెండింటి మధ్యే.

విచారించదగ్గ అంశం ఏమిటంటే ఈ శుక్రవారం ఏ స్ట్రెయిట్ మూవీ లేకపోవడం. బాలీవుడ్ నుంచి రన్వీర్ సింగ్ గల్లి బాయ్ వస్తోంది కానీ మనవాళ్ళు మాత్రం ఈ డేట్ వదిలేసుకున్నారు. మిస్టర్ మజ్ను డల్ అయిపోయాక యాత్ర తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకే మంచి సినిమా లేకపోవడంతో ఫామిలీ ఆడియన్స్ కు ఆప్షన్ లేకుండా పోయింది. ఇప్పటికే ఎఫ్2ని సినిమాలు చూసే అలవాటున్న ప్రతి ఒక్కరు చూసేసారు. 80 కోట్ల షేర్ టచ్ అయ్యింది. ఇంకా అద్భుతాలు జరిగే ఛాన్స్ లేదు.

ఈ నేపధ్యంలో మరో కంటెంట్ ఉన్న సాలిడ్ తెలుగు మూవీ ఏదైనా వచ్చి ఉంటె ప్రేమికుల రోజును వాడుకునే ఛాన్స్ దక్కేది. చేతులారా మిస్ చేసుకున్నట్టు అయ్యింది. నిర్మాణం పూర్తయిన కొన్ని సినిమాలు సైతం ఈ కోణంలో ఆలోచించకపోవడంతో డబ్బింగ్ సినిమాలు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు రెడీ అవుతున్నాయి. అయితే అతి వృష్టి లేకపోతే అనావృష్టి అనేలా తయారయ్యింది బాక్స్ ఆఫీస్ పరిస్థితి.