Begin typing your search above and press return to search.

శిరీష్‌ చాలా పెద్ద ఫీట్ సాధించేశాడు

By:  Tupaki Desk   |   26 Aug 2016 6:41 AM GMT
శిరీష్‌ చాలా పెద్ద ఫీట్ సాధించేశాడు
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా అల్లు శిరీష్ ఇప్పటివరకూ మెగా రేంజ్ కి తగినట్లుగా సక్సెస్ సాధించలేకపోయాడు. మొదటి రెండు సినిమాలు ఈ కుర్రాడిని బాగా డిజప్పాయింట్ చేశాయి. దీంతో మూడో మూవీ విషయంలో బాగా కేర్ తీసుకుని.. శ్రీరస్తు శుభమస్తు అంటూ ఆడియన్స్ ను పలకరించి.. మంచి సక్సెస్ నే కొట్టాడు శిరీష్. ఇప్పుడు నాలుగోవారంలోకి ఎంటర్ అయ్యాక కూడా ఇంకా చాలా సెంటర్లలో షేర్ బేసిస్ పై ఈ సినిమా నడుస్తోందంటే.. శ్రీరస్తు రేంజ్ అర్ధమవుతుంది.

ఇప్పుడీ చిత్రాన్ని యూఎస్ లో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 22 సెంటర్లలో ఈ వారం తిరిగి రిలీజ్ చేయనున్నారు. ఇక్కడా అక్కడా ఒకసారే విడుదలైనా.. అప్పుడు ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. కానీ శ్రీరస్తు శుభమస్తుకి వచ్చిన మౌత్ టాక్.. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కావడంతో.. యూఎస్ లో చాలా సెంటర్లలో ఆడియన్స్ నుంచి డిమాండ్ వచ్చింది. పైగా మరో వారం రోజుల పాటు అక్కడ తెలుగోళ్లకు సరైన సినిమా కూడా ఏదీ లేదు.

ఎన్నారై ఆడియన్స్ నుంచి శిరీష్ సినిమాకి ఈ రేంజ్ డిమాండ్ రావడం.. నాలుగో వారానికే 22 సెంటర్లలో తిరిగి రిలిజ్ చేయడం అంటే.. కచ్చితంగా శిరీష్ పెద్ద ఫీట్ సాధించినట్లే.