Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్: నీది నాది ఒకే కథ

By:  Tupaki Desk   |   29 March 2017 9:30 AM GMT
ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్: నీది నాది ఒకే కథ
X
నిన్ననే ‘మెంటల్ మదిలో’ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు అతను హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా ఫస్ట్ లుక్ కూడా వావ్ అనిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ లో హీరో హీరోయిన్లెవ్వరూ కనిపించలేదు. ఓ ఫన్నీ కాన్సెప్ట్ మాత్రమే ఉంది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో. నీది నాది ఒకే కథ... ఇదీ శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పేరు. ‘బిచ్చగాడు’ ఫేమ్ సత్నా టైటస్ కథానాయికగా నటిస్తోంది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని నిర్మించిన ఆరన్ మీడియా వర్క్స్ బేనర్ మీదే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. నారా రోహిత్ సమర్పిస్తుంటే.. శ్రీవిష్ణు భార్య ప్రశాంతి.. ‘అసుర’ డైరెక్టర్ కృష్ణవిజయ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వేణు ఊడుగుల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. బ్లాక్ బోర్డు మీద ఈ కింది వాటిలో ఏది తప్పు.. ఏది ఒప్పు అని రాసి.. కింద మ్యాథ్స్.. ఫిజిక్స్.. కెమిస్ట్రీ.. ఇంగ్లిష్.. తెలుగు.. ఈ సబ్జెక్టులన్నీ తప్పని.. రుద్రరాజు సాగర్ మాత్రమే రైట్ అని పేర్కొన్నారు. అంటే ఇది నేనే రైట్ అనుకునే ఒక ఇగోయిస్ట్ కథ అన్నమాట. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. మరి సినిమా కూడా ఇలాగే ఉంటుందేమో చూడాలి. తనకు సన్నిహితుడైన శ్రీవిష్ణు మీద నారా రోహిత్ బాగానే శ్రద్ధ పెడుతున్నాడు. అతడి కోసమే ఒక బేనర్ పెట్టి వరుసగా సినిమాలు తీస్తుండటం విశేషమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/