సంపూ కోసం బిగ్ బాస్ '1 టీం

Wed Sep 19 2018 21:34:49 GMT+0530 (IST)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 మంచి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం సీజన్ 2 కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి సీజన్ లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ అంతా కూడా మళ్లీ ఒక స్టేజ్ పైకి వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం పాటల టీజర్ లాంచ్ కార్యక్రమం కోసం బిగ్ బాస్ మొదటి సీజన్ పార్టిసిపెంట్స్ అంతా కూడా ఒకే వేదిక పైకి రాబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కొబ్బరిమట్ట టీం సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సంపూర్నేష్ బాబు గత మూడు సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యిందట. ఈనెల 21న ప్రసాద్ ల్యాబ్స్ లో 15 మంది బిగ్ బాస్ మొదటి సీజన్ పార్టిసిపెంట్స్ సమక్షంలో పాటల టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యు ఈ 15 మందికి కాల్ చేసి కార్యక్రమంకు హాజరు కావాల్సిందిగా కోరడం జరిగిందని - అంతా కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం అందుతుంది. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ పూర్తి అయిన తర్వాత కొందరు కనిపించకుండా పోయారు. వారు కూడా ఈ కార్యక్రమంకు వస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

గత సంవత్సరం 70 రోజుల బిగ్ బాస్ హౌస్ లో ఒక కుటుంబంలా ఎన్నో మధుర జ్ఞాపకాలతో మీ ముందు ఉన్నాం. మరో సారి ఒకే వేదికపై మమ్మల్ని మేము కలుసుకుంటూ మరోసారి మిమ్మల్ని కూడా కలవటానికి మీ ముందుకు వస్తున్నాం అంటూ సంపూర్నేష్ బాబు ‘కొబ్బరిమట్ట’ పాటల టీజర్ లాంచ్ పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంను స్టీవెన్ శంకర్ నిర్మించాడు. సంపూ ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి ప్రచారం జరుగుతుంది.