Begin typing your search above and press return to search.

జిగిరీ దోస్తీలు ఈ దందా ఏంటో!

By:  Tupaki Desk   |   23 April 2019 4:29 AM GMT
జిగిరీ దోస్తీలు ఈ దందా ఏంటో!
X
కింగ్ ఖాన్ షారూక్ - కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఇటీవ‌ల ఈ ఇద్ద‌రూ జిగిరీ దోస్తీలుగా మారిపోయి ఒక‌రి సినిమాల్లో ఇంకొక‌రు కామియోల‌తో అద‌ర‌గొడుతున్నారు. స‌ల్మాన్ `ట్యూబ్ లైట్` చిత్రంలో షారూక్ మెజీషియ‌న్ గా క‌నిపిస్తే.. షారూక్ `జీరో` చిత్రంలో స‌ల్మాన్ ఓ డ్యాన్సింగ్ బిట్ లో దుమ్ము దులిపాడు. రెండు సంద‌ర్భాల్లోనూ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో ఆ ఇద్ద‌రినీ చూసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ఆ సినిమాల ఫ‌లితం మాట ఎలా ఉన్నా.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా దోస్తానా మాత్రం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక‌పోతే ఈ స్నేహం అక్క‌డితో ఆగిపోలేదు. మునుముందు ఇదే తీరుగా కొన‌సాగ‌నుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. సల్మాన్ భాయ్ ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో ద‌బాంగ్ 3లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ చిత్రం షూటింగ్ ని ప్ర‌భుదేవా ప‌రుగులు పెట్టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఇండోర్ షెడ్యూల్ ని ముగించుకుని టీమ్ ముంబైకి ప‌య‌న‌మైంది. త‌దుప‌రి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీక‌ర‌ణ సాగ‌నుందని తెలుస్తోంది. అక్క‌డే స‌ల్మాన్ - షారూక్ కాంబినేష‌న్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఒక‌ట్రెండు రోజుల పాటు ఇద్ద‌రిపై సీన్ల‌ చిత్రీక‌ర‌ణ సాగుతుందిట‌.

ఇక స‌ల్మాన్ సినిమాలో షారూక్ చేసే పాత్ర ఎలాంటిది? అంటే అత‌డు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇస్తాడ‌ట‌. ఒక ధారావి లాంటి ఏరియాలో రాబిన్ హుడ్ లా స‌ల్మాన్ జ‌ర్నీ సాగ‌డంలో బాద్ షా సాయం ఉంటుందిట‌. అంటే స‌ల్మాన్ పాత్ర‌కు స‌హాయ‌క పాత్ర‌గా షారూక్ క‌నిపిస్తారు. కొంద‌రు హీరోల పేర్లు ప‌రిశీలించిన త‌ర్వాత చివ‌రికి ఆ పాత్ర‌లో షారూక్ అయితేనే బావుంటుంద‌ని ద‌ర్శ‌క‌హీరోలు భావించార‌ట‌. దానికి షారూక్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. జీరో ఫ్లాప్ అయిన త‌ర్వాత షారూక్ కి సినిమాలేవీ లేవు. ప్ర‌స్తుతం అత‌డు కెరీర్ ప‌రంగా సందిగ్ధ‌త‌లోనే ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో భాయ్ ఫోన్ చేయ‌గానే వెంట‌నే ఓకే చెప్పాడ‌ట‌. ఇక 2019లో షారూక్ ఏ సినిమాలోనూ న‌టించ‌డం లేదు కాబ‌ట్టి `దబాంగ్ 3`లో మాత్ర‌మే అభిమానులు చూసుకుని సంతృప్తి ప‌డాల్సిందే. ఇటీవ‌లే భ‌ర‌త్ ట్రైల‌ర్ చూసి షారూక్ వెంట‌నే స‌ల్మాన్ కి శుభాకాంక్ష‌లు తెలిపాడు. ట్రైల‌ర్ ఎంతో బావుంద‌ని ప్ర‌శంసించాడు. మొత్తానికి జ‌గిరీ దోస్తీల స‌న్నివేశం చూస్తుంటే సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఇక వీళ్ల కోసం క‌థ రాసుకునే ప‌నిలో ప‌డాల్సిందేనేమో! క‌నీసం ఈ మూవ్ మెంట్ లో అయినా ఆ ఇద్ద‌రితో సినిమా తీయాల‌న్న త‌న క‌ల‌ను నెర‌వేర్చుకుంటాడా? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ అదే సాధ్య‌మైతే మ‌రో విజువ‌ల్ స్పెక్టాక్యుల‌ర్ ఎటెంప్ట్ కి తెర తీసిన‌ట్టేన‌ని భావించ‌వ‌చ్చు.