మిర్చి భామ పెళ్లయిపోయిందా?

Sun Nov 19 2017 21:52:08 GMT+0530 (IST)

రిచా గంగోపాధ్యాయ.. తెలుగులో కథానాయికగా ఆమె చేసింది తక్కువ సినిమాలే కానీ.. అవన్నీ కూడా  పెద్ద స్థాయి సినిమాలే. ‘లీడర్’తో మొదలుపెట్టి ‘మిరపకాయ్’.. ‘మిర్చి’.. ‘భాయ్’ లాంటి పెద్ద సినిమాల్లో ఆమె నటించింది.  తెలుగులోనే కాక తమిళంలోనూ ఆమె స్టార్ హీరోల సరసన నటించింది. ఐతే కథానాయికగా మంచి స్థాయిలో ఉండగానే.. అవకాశాలు వస్తున్నపుడే ఆమె సడెన్ గా సినిమాలకు టాటా చెప్పేసి అమెరికాకు వెళ్లిపోయింది. మూడేళ్ల పాటు వాషింగ్టన్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుకుని డిగ్రీ కూడా పుచ్చుకుంది. ఐతే చదువు పూర్తి చేశాక సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందేమో అనుకుంటే ఇటీవలే అలాంటిదేమీ లేదంటూ తేల్చి చెప్పింది.కట్ చేస్తే ఇప్పుడు రిచా గంగోపాధ్యాయ పెళ్లయిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడిని అమెరికాలోనే రిచా పెళ్లాడినట్లు చెబుతున్నారు. ఈ పెళ్లి ఏ హడావుడి లేకుండా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య చాలా సింపుల్ గా జరిగిపోయిందట. రిచాకు ఇక ఇండియాకు వచ్చే ఉద్దేశం లేదట. అక్కడే ఆమె సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. మంచి చదువు చదివిన రిచా పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉండగా.. సినిమాలకు టాటా చెప్పేసి చదువు మీద దృష్టి పెట్టి.. ఆ తర్వాత కూడా గ్లామర్ ఫీల్డ్ పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడం.. పెళ్లి చేసుకుని సెటిలైపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.