రామ్ కి లోకల్ గ్యాంగ్ హిట్టిస్తుందా?

Thu Feb 15 2018 05:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ విజయాన్నీ చూసి చాలా రోజులు అవుతోంది. ఏ స్థాయిలో ప్రయత్నాలు చేసినా స్టార్ హీరోల లెవెల్లో హిట్స్ అందుకోలేకపోతున్నాడు. దీంతో కొద్దీ కొద్దిగా మార్కెట్ కూడా పడిపోతోంది. కానీ మనోడు ప్రయోగాలు చేయడానికి చాలా దూరంగా ఉంటాడు. ఎక్కువగా లవ్ స్టోరీలతో కూడిన కమర్షియల్ కథలనే గాని నటన పరంగా ప్రయోగం చేద్దామనే కథలను చేయలేదు.దీంతో రామ్ సైడ్ రెగ్యులర్ అభిమానులు తప్ప మరొకరు ఎక్కువగా చుడటం లేదు. కొన్ని నెలల క్రితం వచ్చిన ఉన్నది ఒకటే జిందగి సినిమా కూడా దారుణంగా ఫెయిల్యూర్ ని అందుకుంది. అయితే ఇప్పుడు కూడా రామ్ మళ్లీ లవ్ యాంగిల్ సైడే షిఫ్ట్ అవుతున్నాడు. అంతే కాకుండా రెగ్యులర్ ఫార్మాట్ తో హిట్టు కొట్టే ఓ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. సినిమా చూపిస్త మావ - నేను లోకల్ సినిమా లతో  మామా - అల్లుళ్ల మధ్య సాగే కాన్సెప్ట్ తో హిట్టు కొట్టిన దర్శకుడు త్రినాథరావు రావు నక్కిన - రచయిత ప్రసన్న తో వర్క్ చేస్తున్నాడు. ఇక నేను లోకల్ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.

దాదాపు నేను లోకల్ గ్యాంగ్ మొత్తంగా రామ్ సినిమాకు వర్క్ చేస్తోంది. ఈ సినిమా గత కొంత కాలంగా ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఫైనల్ గా పనులన్నీ పూర్తవ్వడంతో నిర్మాత దిల్ రాజు నేను లోకల్ గ్యాంగ్ తో రామ్ సినిమాను అదే కాన్సెప్ట్ తో షూటింగ్ ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కీర్తి సురేష్ ని కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా పెడదామని అనుకున్నారట. కానీ ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల అనుపమ పరమేశ్వరన్ ని ఒకే చేశారని తెలుస్తోంది. ఇక ఫైనల్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ 16న స్టార్ట్ కానుంది. మరి రామ్ కి ఈ కాంబినేషన్ ఎంతవరకు హిట్ ఇస్తుందో చూడాలి.