Begin typing your search above and press return to search.

వర్మ సారీ చెప్పాడు.. కండిషన్స్ అప్లై

By:  Tupaki Desk   |   29 May 2016 10:59 AM GMT
వర్మ సారీ చెప్పాడు.. కండిషన్స్ అప్లై
X
రామ్ గోపాల్ వర్మ సారీ చెప్పాడు. కాకపోతే అందులో పెద్ద తిరకాసు ఉంది లెండి. సారీ చెప్పినట్లే చెప్పి.. కండిషన్స్ అప్లై అంటున్నాడు వర్మ. ఇంతకీ మేటర్ ఏంటంటే..

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘వీరప్పన్’ మీద రాయిటర్స్ జర్నలిస్ట్ శిల్పా జామ్ ఖండికర్ ఓ రివ్యూ రాసింది. ఆమె సినిమా గురించి నెగెటివ్ వ్యాఖ్యానించింది. విమర్శలు గుప్పించింది. ఐతే వర్మకు ఒళ్లు మండి ఆమె మీద తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ‘‘అంటే వీరప్పన్ సినిమా ఈ రివ్యూయర్ ముఖం లాగా చాలా అందంగా ఉందన్నమాట’’ అంటూ ఆమె ఫొటో పెట్టి వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. దీనిపై విమర్శలు రావడంతో వర్మ సారీ చెబుతూ మళ్లీ ట్వీట్లు చేశాడు. ఇప్పటివరకు ఎవరికీ తాను క్షమాపణ చెప్పలేదని, ఫస్ట్ టైమ్ సారీ చెబుతున్నానని ట్విటర్ లో పేర్కొన్నాడు. తానన్న మాటలను పట్టించుకోవద్దని అన్నాడు.

ఐతే అంతటితో ఆగకుండా తాను తన ఇంటెంట్ విషయంలో సారీ చెప్పలేదని.. కంటెంట్ విషయంలోనే సారీ చెప్పానని తనదైన శైలిలో ఓ తిరకాసు ట్వీట్ కూడా పెట్టాడు వర్మ. మొత్తానికి వర్మ ఆ రివ్యూయర్ కు సారీ చెప్పినట్లా చెప్పనట్లా అని జనాలు అయోమయంలో పడిపోయారు. ఇక ‘వీరప్పన్’ విషయానికి వస్తే.. బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరేమో సినిమా సూపర్ అన్నారు. ఇంకొందరేమో అంత సీన్ లేదన్నారు. ఐతే వర్మ గత సినిమాలతో పోలిస్తే మాత్రం కొంచెం బెటర్ అన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది.