Begin typing your search above and press return to search.

హీరో చేసేందుకు పూరీ కండిషన్స్

By:  Tupaki Desk   |   29 March 2017 10:48 AM GMT
హీరో చేసేందుకు పూరీ కండిషన్స్
X
ఇండస్ట్రీకి కొత్త హీరోను పరిచయం చేయాలంటే.. మొట్టమొదటగా గుర్తొచ్చే దర్శకుడు పూరీ జగన్నాధ్. రామ్ చరణ్ కూడా పూరీ పరిచయం చేసిన హీరోనే అనే విషయం మెగా ఫ్యాన్స్ కు తెలుసు. ఇప్పుడు ఇషాన్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మరి తన కొడుకు ఆకాష్ విషయంలో పూరీ దగ్గర ఎలాంటి ఐడియాస్ ఉంటాయో ఆలోచించచ్చు.

అయితే.. పూరీ కుమారుడు ఆకాష్ ఇప్పటికే ఆంధ్రాపోరితో హీరోగా ఓ ప్రయత్నం చేశాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు. అంతకు ముందే కొన్ని పూరీ సినిమాల్లోను.. ఇతర దర్శకులతో కలిసి పని చేశాడు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో.. పవన్ చిన్నప్పటి రోల్ లో మరిచిపోలేని నటన చూపించాడు. అయితే.. కొడుకుని హీరో చేసేందుకు మాత్రం.. ఈ దర్శకుడు కండిషన్స్ పెట్టాడట. ముఖ్యంగా శరీరాన్ని ఫిట్ గా మార్చుకుని.. దిట్టంగా తయారై.. అది కూడా పర్ఫెక్ట్ బాడీతో ఉంటేనే.. కొడుకుని హీరోగా ప్రమోట్ చేస్తానని చెప్పాడట పూరీ జగన్నాధ్.

పూరీ చెప్పిన మాటలను ఆకాష్ కూడా వినాల్సిందే. అందుకే త్వరలో జిమ్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడట ఆకాష్. ఇప్పటికే ఆకాష్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్న పూరీ.. కొడుకు ఫిట్ గా మారి.. బాడీ బిల్డప్ చేసుకుని వస్తే.. సినిమా చేసేందుకు రెడీ అని చెబుతుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/