కోట్లు తగ్గించినా ప్రాజెక్ట్ ఓకే అనేసింది

Thu Jun 14 2018 17:57:19 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ మధ్య హాలీవుడ్ సినిమాలే కాక న్యూయార్క్ నగరంలోని నివాసం కూడా ఉంటోంది. అక్కడే ఒక పాపులర్ సింగర్ నిక్ జోన్స్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఊహాగానాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ మాత్రం ఈమె రాకకై వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ప్రొడ్యూసర్లు కూడా ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సరే అంటున్నారు.ఇదిలా ఇండగా ఈమె ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. అలీ అబ్బర్ జాఫర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారత్ అనే సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మొదట ఈ సినిమాకి పీసీ టీం 14 కోట్లు డిమాండ్ చేశారట. కానీ అంత అంటే కష్టం కానీ 12 కోట్లు అయితే ఇవ్వగలం అని అనడంతో పిగ్గీ చాప్స్ 12 కోట్లకు సినిమాను ఓకే చేసింది. ఇందులో దిశ పటాని కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమా సౌత్ కొరియన్ లోని 'ఓడే టు మై ఫాదర్' అనే సినిమాకు రీమేక్ గా మనముందుకు రాబోతోంది. దీనిని సల్లు భాయ్ బావ అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నాడు. దాదాపు సల్మాన్ అన్ని సినిమాల లాగానే ఈ సినిమా కూడా ఈద్ సీజన్ లో విడుదలకు సిద్దమవుతోంది. ఈ డస్కీ బ్యూటీ కి ఉన్న ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ అన్ని జూన్ లోపు పూర్తి చేసుకుని జులై మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో బిజీ కానుంది.