Begin typing your search above and press return to search.

ఇప్పుడైనా బాహుబలి 2 ఆడుతుందా??

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:50 PM GMT
ఇప్పుడైనా బాహుబలి 2 ఆడుతుందా??
X
బాహుబలి అండ్ బాహుబలి 2. వీటికి తిరుగేలేదు. కొత్తగా ఈ సినిమాల గురించి మనం ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమాలు రెండూ ఇండియాలో పెద్ద పెద్ద హిట్లు. రాజమౌళి వాటిని తీర్చిదిద్దిన విధానం వాటిని ఇండియా అంతటా ఆడేలా చేసింది. అందుకే బాహుబలి 2 సినిమాకు ఏకంగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా పట్టేసింది. అయితే ఈ అదిరే పెర్ఫామెన్స్ హైప్ అంతా కూడా మన భారతదేశంలోనే కనిపించింది.

ఆల్రెడీ హిందీ సినిమాలు జర్మన్ అండ్ చైనీస్ వంటి బాషల్లోకి డబ్ అయిపోయి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. అక్కడికీ పీకె సినిమా చైనాలో కూడా కోట్లను కొల్లగొట్టింది కాబట్టి.. బాహుబలిని కూడా ఇతర దేశాల్లో దించారు. కాని విచిత్రంగా జర్మన్ లో ఈ సినిమా డిజాష్టర్అయ్యింది. అక్కడి జనాలు అస్సలు పట్టించుకోలేదు. అలాగే చైనీస్ మాండరిన్ బాషలో కూడా రిలీజైన బాహుబలి అక్కడ కూడా ఫ్లాపే అయ్యాయని ట్రేడ్ వర్గాలు అప్పట్లో చెప్పాయ్. అయితే ఇప్పుడు అన్ని ఫ్లాపులు చూసిన బాహుబలి సీక్వెల్ ను కూడా అక్కడ రిలీజ్ చేస్తారట.

త్వరలోనే బాహుబలి 2 సినిమా ఒక కొత్త టెరిటరీలో తన సత్తా చాటాలని చూస్తోంది. జపానీస్ బాషలోకి డబ్బింగ్ చేయబడిన ఈ సినిమా.. డిసెంబర్ 29న జపాన్ లో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ అక్కడి సెన్సార్ బోర్డు బాహుబలి 2 సినిమాకు 'యు' రేటింగ్ కు సమానమైన 'జి' రేటింగ్ ఇచ్చింది. చూద్దాం మరి బాహుబలి చేయలేని ఫీట్.. బాహుబలి 2 చేస్తుందేమో.