Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఫ్యాన్ వినోద్ రాయ‌ల్ ఫైన‌ల్ పోస్ట్ ఇదే

By:  Tupaki Desk   |   26 Aug 2016 9:28 AM GMT
ప‌వ‌న్ ఫ్యాన్ వినోద్ రాయ‌ల్ ఫైన‌ల్ పోస్ట్ ఇదే
X
క‌ర్ణాట‌క‌లోని కోలార్ జిల్లాలో గ‌త ఆదివారం జ‌రిగిన గొడ‌వ‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ - ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఫ్యాన్ వినోద్ రాయ‌ల్ హ‌త్య‌కు గురికావ‌డం ఇప్పుడు సెన్షేష‌న‌ల్ న్యూస్‌ గా మారింది. తిరుప‌తికి చెందిన వినోద్ రాయ‌ల్ మ‌రో టాలీవుడ్ స్టార్ హీరో అభిమాని చేతిలో హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య ఇప్పుడు రెండు తెలుగు స్టేట్‌ ల‌తో పాటు జాతీయ మీడియాలోను చ‌ర్చ‌కు వ‌చ్చింది.

మ‌రో ఆరు నెల‌ల్లో అమెరికాకు వెళ్లాల్సిన వినోద్ ఇలా హ‌త్య‌కు గురికావ‌డంతో ఆ కుటుంబం సైతం ఎంతో త‌ల్ల‌డిల్లిపోతోంది. ప‌వ‌న్ సైతం గురువారం తిరుప‌తి వెళ్లి వినోద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. వినోద్ కుటుంబానికి తాను అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్ హామీ ఇచ్చాడు. ఇక ప‌వ‌న్‌కు వినోద్ రాయ‌ల్ ఎంత వీరాభిమానో వినోద్ పెట్టిన చివ‌రి పోస్టు చెపుతోంది. ఇప్పుడు ఇది సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది.

వినోద్ క‌ర్ణాట‌క‌లో అవ‌య‌వ‌దానం గురించి మాట్లాడేందుకు వెళ్లేముందు త‌న ఫేస్‌ బుక్‌ లో ఆ పోస్ట్ పెట్టుకున్నాడు. ఈ ఫోస్ట్‌ లో వినోద్ తాను అవ‌య‌వ‌దానంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప‌వ‌న్ ఫ్యాన్స్ క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళుతున్నాన‌ని... మేం కేవ‌లం ప‌వ‌న్ ఫ్యాన్స్ కాదు... ప‌వ‌న్ ఆలోచ‌నా విధానానికి ఫాలోవ‌ర్స్ కూడా అని పేర్కొన్నాడు.

ఈ పోస్ట్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ప‌దే ప‌దే లైకులు కొట్టి - షేర్లు చేశారు. ఈ పోస్ట్ చూసిన ప‌లువురు వినోద్‌ ను త‌ల‌చుకుని మ‌రోసారి బాధ‌ప‌డుతున్నారు. ఓ మంచి కార్య‌క్ర‌మానికి వెళ్లినందుకు వినోద్‌ కు ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వారు తెలిపారు. ప‌వ‌న్ ఆలోచ‌న‌లు - ఆశ‌యాల‌కు త‌గిన‌ట్టు ప‌నిచేస్తోన్న ఉత్సాహ‌వంతుడైన యువ‌కుడిని కోల్పోవ‌డం త‌మ‌కు చాలా బాధ క‌లిగించింద‌ని వారు బాధ‌ప‌డుతున్నారు.