Begin typing your search above and press return to search.

తెలుగులో భాజరంగీ భాయ్ జాన్

By:  Tupaki Desk   |   3 Aug 2015 2:23 PM GMT
తెలుగులో భాజరంగీ భాయ్ జాన్
X
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం భాజరంగీ భాయ్ జాన్ విడుదలైన 17రోజులకే 500కోట్ల మార్కు కలెక్షన్ల ను అందుకుని సల్మాన్ స్టామినా ఏమిటో నిరువుపించింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన అద్భుతమైన కధకు కభీర్ ఖాన్ దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఈ సినిమా సంచలనాలు నెలకొల్పింది.చిన్న పాప హర్షాలీ ఎంతో మంది మనసు దోచుకుంది.

అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. అదీ సాదాసీదా క్యాస్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. దిల్ రాజు నిర్మాతని, హరీష్ శంకర్ దర్శకుడని విరివిగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్త పై ఇప్పటివరకూ వినిపించిన పేర్లలో ఎవరూ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం సర్దార్ చిత్రీకరణ జరుపుకుంటున్న పవన్ తదుపరి ప్రాజెక్ట్లు కోబలి, దాసరితో ఒక సినిమా అని ప్రచారంలో వున్నాయి. మరి ఈ భాజరంగీ న్యూస్ ఎంతవరకూ కార్యరూపందాలుస్తుందో చూడాలి.