Begin typing your search above and press return to search.

నాగ్ ఆఫీసర్.. బయోపిక్ అంటున్నాడు

By:  Tupaki Desk   |   18 May 2018 3:48 AM GMT
నాగ్ ఆఫీసర్.. బయోపిక్ అంటున్నాడు
X
అక్కినేని నాగార్జుతో తీసిన ఆఫీసర్ చిత్రానికి ఎలాగైనా సరే బిజినెస్ చేసేందుకు రాంగోపాల్ వర్మ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కారణంగానే మే 25 నుంచి జూన్ 1కి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను.. తాను ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ జీవితం అధారంగా రూపొందించానంటున్నాడు వర్మ.

'నాగార్జున నటించిన ఆఫీసర్ ను.. నిజ జీవితంలో కర్నాటక ఐపీఎస్ ఆఫీసర్ కేఎం ప్రసన్న జీవితంగా రూపొందించాను. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు చీఫ్ గా పని చేశారు. 2010లో కేఎం ప్రసన్న నుంచే విన్న ఓ అనుభవమే.. ఇప్పుడు ఆఫీసర్ గా తెరకెక్కింది. ప్రస్తుతం ముంబై.. క్రైం బ్రాంచ్.. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కేఎం ప్రసన్న పాత్రలో నాగార్జున కనిపించనున్నారు' అని చెప్పిన వర్మ.. ఆయన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. నాగార్జునలోను.. కేఎం కొన్ని పోలికలు ఉంటాయని.. ఇద్దరు మానసికంగా చాలా శక్తివంతమైన వారు అని చెప్పాడు వర్మ.

వర్మ చెప్పిన తర్వాత.. ఇందులో ఎంత నిజం ఉందనే విషయం అప్పుడే క్లిష్టమైన విషయం అయిపోతుంది. ఒకవేళ ఇది నిజమే అయితే.. ఇప్పటివరకూ చెప్పకుండా ఉంటాడా.. ప్రచారం కోసం ప్రతీ అంశాన్ని వాడేసుకునే అలవాటు గల రాంగోపాల్ వర్మ.. ఈ విషయాన్ని ఇంత కాలం పాటు సైలెంట్ గా ఉంచి.. ఇప్పుడు బిజినెస్ కాకపోవడంతోనే బైట పెట్టి ఉంటాడా.. అసలు ఇదంతా నిజమేనా అనే సందేహాలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.