Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాను కొనేసుకున్న హీరో

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:41 PM GMT
బాలయ్య సినిమాను కొనేసుకున్న హీరో
X

ఆంధ్ర ఏరియా రైట్లకు 30 కోట్లు.. అలాగే నైజాం ఏరియా రైట్ల కోసం 18 కోట్లు.. ఇక సీడెడ్ 9 కోట్లు.. ఈ రేంజులో ''గౌతమీపుత్ర శాతకర్ణి'' రేట్లు ఉన్నాయని ఆల్రెడీ తెలిసిన రూమర్లే. అయితే బాలయ్య 100వ సినిమా కాబట్టి.. ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్లకంటే ఎక్కువగానే ఇచ్చి కొనడానికి పంపిణీదారులు కూడా రెడీగా ఉన్నారు. అదిగో మొన్ననే సీడెడ్ రైట్లను సాయి కొర్రపాటి కొనుక్కున్నాడు. ఇప్పుడు తదుపరి ట్విస్టేంటో చూస్కోండి మరి.

బాలయ్య 100వ సినిమాను ఎలాగైనా పంపిణీచేయాలని ఫిక్సయ్యాడు హీరో నితిన్. ఎప్పటినుండో ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ''24'' సినిమాను పంపిణీ చేసిన తరువాత మనోడు కాస్త స్లో అయ్యాడులే. కాని ఇప్పుడు మాత్రం చెప్పినంత ఎమౌంట్ ఇచ్చేసి.. ఏసియన్ సినిమాస్ తో కలసి నితిన్ తన శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా నైజాం ఏరియాలో ''గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు స్వయంగా నితిన్ ప్రకటించాడు.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న శాతకర్ణి.. మొన్ననే మధ్య ప్రదేశ్ లో ఒక షెడ్యూల్ పూర్తిచేశారు. మరోసారి బాలయ్య అండ్ డైరక్టర్ క్రిష్‌ టీమ్ జార్జియా వెళ్ళే ఛాన్సు కూడా ఉందట. నాలుగు విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలు పోస్టు ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైయున్నాయి. అది సంగతి.