Begin typing your search above and press return to search.

బోల్డ్ కి అమ్మ మొగుడు లాంటి ట్రైలర్!

By:  Tupaki Desk   |   18 Dec 2018 9:09 AM GMT
బోల్డ్ కి అమ్మ మొగుడు లాంటి ట్రైలర్!
X
ప్రతి దేశంలో కొన్ని సున్నితమైన సమస్యలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే వాటిమీద ఏం మాట్లాడినా మాడు పగిలిపోతుంది. సపోర్ట్ గా మాట్లాడితే సగం మంది మనపై దాడి చేస్తారు. వ్యతిరేకంగా మాట్లాడితే మిగతా సగం మంది జనాలు మన రక్తం తాగుతారు. దీన్లో తప్పు ఒప్పులు ఎవరివి అనేది ఎవ్వరూ చెప్పలేరు.. ఒకవేళ న్యూట్రల్ స్టాండ్ తీసుకొని చెప్తే వాడి అంతు కూడా తేలుస్తారు. అలాంటి అంశమే రిజర్వేషన్లు.

సరిగా ఈ అంశం మీద ఇప్పుడు తెలుగులో ఒక బోల్డ్ సినిమా వస్తోంది. సినిమా పేరు 'నేను C/o నువ్వు'. ఈ చిత్రానికి దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ. "చదువులకు ఉద్యోగాలకు మేము మీతో సమానం కాదని.. చదివి ఉద్యోగాలు తెచ్చుకునే వారు ప్రేమ.. పెళ్ళి విషయానికి వచ్చేసరికి మనుషులంతా సమానమే అని ఎలాగంటారు?" అని ప్రశ్నించడం లాంటివి చూస్తుంటే.. ఈ ట్రైలర్ ఎంత బోల్డ్ అన్నది మనకు అర్థం అవుతుంది. ఇది జస్ట్ శాంపిల్.. ఇంకా వివాదాలు రేపే సీన్లు చాలా ఉన్నాయి.

మరి ఈ సినిమా ఎంతమాత్రం రిలీజ్ అవుతుందనేది అనుమానమే. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ నుండి తొలగించారు. దీనిబట్టి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ట్రైలర్ ను మళ్ళీ అందుబాటులో ఉంచుతారా లేదా అన్నది ఇంకా తెలీదు.