ప్రపంచ సుందరి జలకాలాటలు

Mon Jan 21 2019 21:19:34 GMT+0530 (IST)

ఐశ్వర్యా రాయ్ ప్రియాంక చోప్రా సుశ్మితాసేన్ వంటి భామలు తొలుత అందాల పోటీల రాణులుగా కీర్తిని ఆర్జించి అటుపై రంగుల ప్రపంచంలో అడుగుపెట్టారు. ప్రపంచ సుందరి విశ్వసుందరి అన్న పిలుపు అందుకున్న తర్వాత బాలీవుడ్ లో కెరీర్ ని పెద్ద స్థాయిలో మలుచుకున్నారు. దీపిక పదుకొనే సైతం అందాల పోటీల నుంచి వచ్చి ఇంతింతై అన్న చందంగా ఎదిగింది. అయితే వీళ్ల రేంజులో ఆ తర్వాత వేరొక అందాల భామ పాపులారిటీ దక్కించుకోలేకపోయింది.ఇప్పటికీ ఆ నలుగురు భామలు బాలీవుడ్ స్టార్లుగా వెలిగిపోతున్నారు కానీ అందాల పోటీల్లో నెగ్గి హిందీ పరిశ్రమలో దూసుకొచ్చిన బ్యూటీ ఎవరూ కనిపించలేదు. అయితే ఆ స్థానాన్ని బర్తీ చేసేందుకు 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్  ప్రయత్నిస్తోందిట. ఈ బ్యూటీ ట్యాలెంటెడ్ లేడీ డైరెక్టర్ ఫరా ఖాన్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు.. బయోపిక్ జోనర్ లో ఓ కొత్త పంథా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. భారతదేశానికి దాదాపు 17 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిన మానుషికి ఈ అరుదైన అవకాశం దక్కడంపై అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక మానుషిని అన్నిరకాలా పరీక్షించిన తర్వాతనే కథానాయికగా ఎంపిక చేసుకున్నానని ఫరాఖాన్ చెబుతున్నారు.

ఇకపోతే ఈ బయోపిక్ ఎవరి జీవితానికి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది? అన్నది తెలియాల్సి ఉందింకా. ఫరాఖాన్ ఇదివరకూ `ఓం శాంతి ఓం` చిత్రంతో దీపిక పదుకొనేని కథానాయికగా పరిచయం చేశారు. అటుపై దీపిక ఏ స్థాయికి ఎదిగిందో తెలిసిందే. మానుషి ఆ స్థాయికి ఎదుగుతుందేమో చూడాలి. ఇక ఈ అమ్మడు ఖాన్ ల త్రయం ఛాన్స్ ఇస్తే నటించేందుకు సిద్ధమేనని ఇదివరకూ ప్రకటించింది. కానీ వారెవరూ ఇంతవరకూ స్పందించలేదు. ఈలోగానే ఫరాఖాన్  దర్శకత్వంలో ఛాన్స్ దక్కించుకుంది. తాజాగా మానుషి ఓ అందమైన ఫోటోని షేర్ చేసింది. మానుషి నాటి మేటి క్లాసిక్ నటిని పోలి ఉండే గెటప్ తో దర్శనమిచ్చింది. జలకాలాటలలో ఉన్న కథానాయిక రూపమిది. అయితే మానుషి నటిస్తున్న బయోపిక్ స్టిల్ ఇదేనా? అంటూ సందేహం నెలకొంది. ``వర్ణించేందుకు పదాలు దొరకలేదు`` అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది మానుషి. అంటే తన తొలి సినిమా ఆడిషన్స్ నుంచి వెలికి తీసిన ఫోటో ఇదని భావించాల్సి ఉంటుంది. డెబ్యూకి సంబంధించి ఏమాత్రం హింట్ కూడా ఇవ్వడం లేదు ఈ అమ్మడు.