మహేష్ అక్కతో నాని సినిమా

Wed Dec 13 2017 10:21:01 GMT+0530 (IST)

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని.. సినిమా నిర్మాణంలో సత్తా చాటుతోంది. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిత్రాలను తెరకెక్కిస్తున్న ఈమె.. ఇప్పుడు వేగం పెంచాలని డిసైడ్ అయిపోయింది. ఏం మాయ చేశావే చిత్రం తర్వాత ఇప్పటివరకూ నిర్మాణానికి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు వరుసగానే సినిమాలు తీస్తోంది.ఇప్పుడు నానితో ఓ మూవీ చేసేందుకు మంజుల సిద్ధమైందని తెలుస్తోంది. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. ఈ మూవీకి మనం.. హలో వంటి చిత్రాలను రూపొందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే నాని ని కలిసిన విక్రమ్ కె కుమార్.. మాంచి స్టోరీ లైన్ వినిపించాడట. కథ విపరీతంగా నచ్చేయడంతో.. వెంటనే మూవీ చేసేద్దామని చెప్పాడట నాని. ప్రస్తుతం ఎంసీఏ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్న న్యాచురల్ స్టార్.. ఇప్పటికే మరో చిత్రాన్ని కూడా ఫినిషింగ్ దశకు తెచ్చేశాడు.

కృష్ణార్జున యుద్ధం టైటిల్ పై రూపొందుతున్న చిత్రంలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడు నాని. ఈ సినిమాకు మరో 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానుండగా.. ఈ సమయంలోనే మంజుల నిర్మాతగా సినిమాను స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.