Begin typing your search above and press return to search.

త‌మిళ్‌ కి షిఫ్ట్ అవుతాన‌న్న మంచు ల‌క్ష్మి

By:  Tupaki Desk   |   18 July 2018 1:47 PM GMT
త‌మిళ్‌ కి షిఫ్ట్ అవుతాన‌న్న మంచు ల‌క్ష్మి
X
మోహ‌న్‌ బాబు నుంచి న‌టన‌లోనే కాదు... నిర్మాత‌గా కూడా వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుంది మంచు ల‌క్ష్మి. మంచి అభిరుచితో క‌థ‌ల్ని ఎంపిక చేసుకొని సినిమాలు చేసింది. కానీ క‌లిసి రాలేదు. గుండెల్లో గోదారి - ఊ కొడ‌తారా ఉలిక్కిప‌డ‌తారా చిత్రాల‌పై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకొని చేసింది. కానీ ఆ చిత్రాలు ల‌క్ష్మికి పేరు తెచ్చాయి కానీ... డ‌బ్బులు మాత్రం తీసుకురాలేక‌పోయాయి. దాంతో ల‌క్ష్మి వేగం త‌గ్గింది. న‌ట‌న‌లోనూ ఆమెకి చెప్పుకోద‌గ్గ పాత్ర‌లు రాలేదు. ఈమ‌ధ్యే `వైఫ్ ఆఫ్ రామ్` చేసింది. మ‌రో నిర్మాత‌తో క‌లిసి ఈ సినిమా చేసింది. రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం శుక్ర‌వారం వ‌ర‌కు ఆగాల్సిందే.

అయితే ఆ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ షాకింగ్ విషయాన్ని వెల్ల‌డించింది ల‌క్ష్మీ. త్వ‌ర‌లోనే తాను త‌మిళంకి షిఫ్ట్ అవుతాన‌ని ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌ కి గురిచేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఒక భాష‌లోనే ఉంటూ మ‌న విలువ మ‌న‌కు తెలియ‌దు అందుకే ఇత‌ర భాష‌ల్లోనూ న‌టించాల‌నేది త‌న ఉద్దేశం అంది. ప్ర‌స్తుతం ల‌క్ష్మి త‌మిళంలో `తుమ్హారీ సులు` రీమేక్‌లో న‌టిస్తోంది. ఇందులో జ్యోతిక ముఖ్య‌పాత్ర పోషిస్తోంది. ల‌క్ష్మీది కూడా ప్రాధాన్య‌మున్న పాత్రే. ఆ చిత్రం గురించి చెబుతూనే ల‌క్ష్మీ తాను ఈ సినిమా త‌ర్వాత త‌మిళంల‌కి షిఫ్ట్ అవుతాన‌ని, అక్క‌డ తన‌ని బుజ్జిబుజ్జిగా చూసుకుంటున్నార‌ని చెప్పుకొచ్చింది.