Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌లో కాల‌రెగ‌రేసిన‌ సారు!

By:  Tupaki Desk   |   13 Oct 2019 10:48 AM GMT
బెజ‌వాడ‌లో కాల‌రెగ‌రేసిన‌ సారు!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ భ‌ర‌త్ అనే నేను.. మ‌హ‌ర్షి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ అందుకున్నాడు. వ‌రుస‌గా రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు అవ్వ‌డంతో మ‌హ‌ర్షి స‌క్సెస్ మీట్ లో మ‌హేష్ కాల‌రెగ‌రేసి మ‌రీ హిట్టు కొట్టాం అంటూ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసాడు. గ‌తంలో ఏ సినిమా ఈవెంట్ లోనూ మ‌హేష్ ఇంత ఉత్సాహాన్ని చూపించ‌లేదు. దీంతో అభిమానులే స్ట‌న్ అయిపోయారు. మా హీరోయేనా? అంటూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబారు.

తాజాగా మ‌హేష్ మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసాడు. నేడు ఆయ‌న విజ‌య‌వాడ‌లో ఓ షాపింగ్ మాల్ కు ఓపెనింగ్ కు వెళ్లారు. దీంతో భారీ ఎత్తున అభిమ‌నులు మ‌హేష్ ని చూడ‌టం కోసం త‌ర‌లి వ‌చ్చారు. అంద‌రికీ అభివాదం చేస్తూ మైక్ అందుకుని అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడాడు. అలాగే విజ‌యవాడ‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. విజ‌య‌వాడ‌లో త‌ను న‌టించిన ఎన్నో సినిమా ఈవెంట్లు జ‌రిగాయ‌ని...అప్ప‌టి నుంచి ఇక్క‌డ అభిమానులు ఎంతో ఆద‌రిస్తార‌ని గుర్తు చేసుకున్నారు. మ‌ళ్లీ మీరు.. నేను కాల‌రెగ‌రేసే సినిమా వ‌స్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ధీమా వ్య‌క్తం చేసారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ - అనీల్ రావిపూడి కాంబినేష‌న్ లో `స‌రిలేరు నీకెవ్వ‌రు` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు మ‌హేష్‌. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.. టీజ‌ర్ కి మంచి రెస్పాన్ వ‌చ్చింది. ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి స‌క్సెస్ రేటు కూడా బాగుంది. ఈ నేప‌థ్యంలో మ‌రో హిట్టు కొడతారన్న న‌మ్మ‌కం ట్రేడ్ వ‌ర్గాల్లోనూ బ‌లంగా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ కి నేడు మ‌హేష్ మ‌రోసారి బూస్ట్ ఇచ్చాడు.