Begin typing your search above and press return to search.

విజయ్ కాంత్..చిరులతో మహేష్ ను పోలిస్తే..

By:  Tupaki Desk   |   25 Sep 2017 3:30 PM GMT
విజయ్ కాంత్..చిరులతో మహేష్ ను పోలిస్తే..
X
తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘రమణ’ అనే సినిమా చేశాడు స్టార్ హీరో విజయ్ కాంత్. కొన్నేళ్లకే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక తెలుగులో మురుగదాస్ మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్’ సినిమా చేశారు. ఆయన కూడా తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘స్పైడర్’ ప్రమోషన్ల కోసం చెన్నైకి వెళ్లిన మహేష్ దగ్గర ఓ తమిళ విలేకరి ఇదే విషయం ప్రస్తావించాడు. ఇప్పుడు మురుగదాస్ మీతో సినిమా చేస్తున్నారు కాబట్టి.. మీరు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అని అడిగేసరికి మహేష్ షాకైపోయాడు. ఒక నవ్వు నవ్వేసి.. ‘‘నాకు పాలిటిక్స్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదండీ’’ అని ఒక్క మాటలో సమాధానం ముగించేశాడు.

‘స్పైడర్’ తరహాలోనే ఇకముందూ ద్విభాషా చిత్రాలు చేస్తారా అని మరో విలేకరి అడిగితే.. ‘‘స్పైడర్ సినిమా బడ్జెట్ ఎక్కువ. ఆ మొత్తం రికవర్ కావాలంటే కేవలం తెలుగులో చేస్తే సరిపోదు. అందుకే తమిళంలో కూడా చేశాం. ఈ కథ కూడా రెండు భాషల వాళ్లకూ కనెక్టవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కథ వస్తే తప్పకుండా ద్విభాషా చిత్రం చేస్తాను’’ అని చెప్పాడు మహేష్. ‘స్పైడర్’తో తమిళంలోకి అడుగుపెడుతున్న మీకు.. ఇక్కడి స్టార్ హీరోల్లో ఎవరెవరిని పోటీగా భావిస్తున్నారని అడిగితే.. తమిళంలో చాలా పెద్ద స్టార్లున్నారని.. ఇక్కడ చాలా పెద్ద స్థాయి సినిమాలు వస్తుంటాయని.. తాను ఇప్పుడు కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నానని.. పోటీ గురించి ఆలోచించే పరిస్థితి లేదని మహేష్ జవాబిచ్చాడు.