Begin typing your search above and press return to search.

లిటిల్ సోల్జ‌ర్స్ కావ్యకి పెళ్లంట‌

By:  Tupaki Desk   |   24 Nov 2015 5:02 AM GMT
లిటిల్ సోల్జ‌ర్స్ కావ్యకి పెళ్లంట‌
X
బేబి షామిలి - బేబి షాలిని లాంటి పేర్లు వినిపిస్తే జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి చిత్రాన్ని గుర్తు చేసుకుంటాం. అలాగే బేబి కావ్య అంటే వెంట‌నే లిటిల్ సోల్జ‌ర్స్ మూవీ గుర్తొస్తుంది. 1996 లో రిలీజైన ఈ బాల‌ల చిత్రం బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కావ్య జాతీయ ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారం అందుకుంది.

అయితే ఇప్పుడు ఆ అమ్మాయి బేబి కాదు. పెరిగి పెద్ద‌దైంది. కుషాల్ హిప్ప‌ల‌గావోంక‌ర్ అనే కుర్రాడిని పెళ్లాడ‌బోతోంది. ఇటీవ‌లే ఎంగేజ్‌ మెంట్ కార్య‌క్ర‌మం పూర్త‌యింది. ఆదివార‌మే రిసెప్ష‌న్ ఘ‌నంగా ఏర్పాటు చేశార‌ని స‌మాచారం. మ‌రో వారంలో కేర‌ళ‌లో వీరి వివాహ మ‌హోత్స‌వం ఉంటుంద‌ని చెబుతున్నారు. బేబి కావ్య లిటిల్ సోల్జ‌ర్స్ మూవీతో ఆక‌ట్టుకున్నా.. ఆ త‌ర్వాత బేబి షామిలి - షాలినీ త‌ర‌హాలో క‌థానాయిక‌గా ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు.

ఫిలింస‌ర్కిల్స్‌ లో మిన‌హా బైటి ప్ర‌పంచంలో త‌న‌కి సంబంధించిన స‌మాచారం తెలిసింది త‌క్కువే. అయితే కావ్య ప్ర‌ముఖ నిర్మాత గుణ్ణం గంగ‌రాజుకి బంధువు - హైద‌రాబాద్‌ లో ఫేమ‌స్ డాక్ట‌ర్‌ గా గుర్తింపు ఉన్న గుర‌వారెడ్డి త‌న‌యురాలు. ఆమె ఇప్పుడొక డాక్టర్‌. త్వరలోనే హైదరాబాద్‌ లో ఓ స్పెషలిస్టు హాస్పిటల్‌ కడతారని తెలుస్తోంది.