7న ఖైదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్

Mon Jan 02 2017 11:27:31 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 4న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తామని నిర్మాత రామ్ చరణ్ స్వయంగా ప్రకటించినా.. ప్రభుత్వం అనుమతులు రాకపోవడంతో సాధ్యం కాలేదు.

విజయవాడ స్టేడియంలో ఈవెంట్ జరిపే అవకాశం లేదని తేలిపోవడంతో ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టిన ఖైదీ యూనిట్.. ఈ కార్యక్రమాన్ని గుంటూరుకు తరలించింది. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఖైదీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నారు. ఈ నెల 7వ తేదీన గ్రాండ్ గా జరుపుతున్నట్లు అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ ఈవెంట్ అంటూ జరిగే ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యే అవకాశాలున్నాయి.

ఖైదీ నంబర్ 150 మూవీ రిలీజ్ కేవలం 4 రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతుండడం విశేషం. మూవీపై ఇప్పటికే విపరీతమైన బజ్ ఉండగా.. అభిమానుల సంబరాలు అప్పుడే ఆకాశాన్ని అంటే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు 7వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి కేవలం 4 రోజుల్లో అంటే జనవరి 11న సినిమా రిలీజ్ కానుండడంతో.. అభిమానుల ఆనందం పీక్ స్టేజ్ కి చేరిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/