Begin typing your search above and press return to search.

నో చెప్పడం మంచిదే అయ్యింది

By:  Tupaki Desk   |   10 Dec 2018 12:37 PM GMT
నో చెప్పడం మంచిదే అయ్యింది
X
కళ్యాణ్‌ రామ్‌ ‘పటాస్‌’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పటాస్‌ లో కళ్యాణ్‌ రామ్‌ పోలీస్‌ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఆయన వద్దకు పలు కాప్‌ స్టోరీస్‌ వచ్చాయట. అందులో ఒకటి ‘కవచం’ స్టోరీనట. దర్శకుడు శ్రీనివాస్‌ మామిళ్ల కవచం కథను పలువురు హీరోల వద్దకు తిప్పాడని - అందులో భాగంగానే కళ్యాణ్‌ రామ్‌ కు కూడా ఈ స్టోరీ వినిపించాడని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కళ్యాణ్‌ రామ్‌ ఏదో కారణంతో ఈ ప్రాజెక్ట్‌ ను సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది.

కళ్యాణ్‌ రామ్‌ నో చెప్పడంతో దర్శకుడు కవచంను బెల్లంకొండ శ్రీనివాస్‌ వద్దకు తీసుకు వెళ్లాడట. పోలీస్‌ స్టోరీ చేయాలని ఉత్సాహంగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్‌ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ పరంగా కూడా తన పాత్ర చాలా పవర్‌ ఫుల్‌ గా దర్శకుడు నరేట్‌ చేయడంతో మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పడం జరిగిందట. కొత్త దర్శకుడు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా బెల్లంకొండ చేసిన ఫలితం ఆశించిన స్థాయిలో అలరించడంలో విఫలం అవుతోంది.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కవచం’ చిత్రం ఒక మోస్తరు ఓపెనింగ్స్‌ ను రాబట్టింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం నిరాశ పర్చిందంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. కాజల్‌ - మెహ్రీన్‌ హీరోయిన్స్‌ నటించారు. భారీ తారాగణంతో రూపొందిన కవచం బెల్లంకొండ శ్రీనివాస్‌ లోని మాస్‌ యాంగిల్‌ ను చూపడంలో బాగా ఉపయోగపడినది అంటూ టాక్‌ వినిపిస్తుంది.