‘జిగేల్ రాణి’ సింగర్ ఆవేదన..

Mon Jul 16 2018 17:04:26 GMT+0530 (IST)

దర్శకుడు సుకుమార్ తాజాగా ‘రంగస్థలం’ సినిమాతో హిట్ కొట్టాడు. తన ప్రతి సినిమాలోనూ ఓ మాస్ మసాలా సాంగ్ ను పెట్టడం అతనికి అలవాటు. అలానే రంగస్థలం లో కూడా ‘జిగేల్ రాణి’ పాటను పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జిగేల్ రాణి పాట పాడిన సింగర్ గంటా వెంకట లక్ష్మి తనకు అన్యాయం జరిగిందని మీడియా ముందటకు రావడం సంచలనమైంది.రంగస్థలం సినిమాలోని రెండు ఫోక్ సాంగ్స్ ను సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ జానపద పాటలు పాడిన వారితోనే పాడించాడు. జిగేల్ రాణి పాటను ‘గంటా వెంకట లక్ష్మి ’తో పాడించాడు. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చింది.  జిగేల్ రాణి పాట పాడడం తన అదృష్టమని.. కానీ ఆ పాట పాడినందుకు సంతోషించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఉందని వాపోయింది. చెన్పై వెళ్లి మరీ ‘జిగేల్ రాణి’ పాట పడి వస్తే తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వెంకటలక్ష్మి తెలిపింది. పాట పాడేందుకు మధ్యవర్తి ద్వారా తనను సంప్రదించారని.. డబ్బు మొత్తం అతడే తీసుకొని మోసం చేశాడని ఆరోపించింది. ఈ వివాదంపై రంగస్థలం చిత్రం యూనిట్ మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.