ఐడ్రీమ్ తాజా సంచలనం 'డార్లింగ్ మాలచిమి’

Thu Dec 13 2018 14:00:14 GMT+0530 (IST)

ఐడ్రీమ్ మీడియా నుంచి మరో సంచలనం 'డార్లింగ్ మాలచిమి'.కంటెంట్ ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ లో పయనీర్ అయిన ఐడ్రీమ్ - ఇప్పటికే మారుతి - చిన్ని కృష్ణ కాంబినేషన్ లో భజన బ్యాచ్ ని యుప్ టివి ప్లాట్ ఫామ్ కోసం రూపొందించిన సంగతి తెల్సిందే. రెండో వెంచర్ గా 'డార్లింగ్ మాలచిమి'ని తీసుకొచ్చింది.

విఐయు ద్వారా ఎయిర్ చేసేందుకు ఐడ్రీమ్ మీడియా (iDream Media) రూపొందించిన తొలి సిరీస్ 'డార్లింగ్ మాలచిమి'.

యూట్యూబ్ - ఈటీవీ ప్లస్ టెలివిజన్ ఛానల్ - యుప్ టివి డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం ఇప్పటికే ఎల్ ఓఎల్ ఓకే ప్లీజ్ - డిజె -  స్టే ఫూలిష్ - ఎవడి గోల వాడిది - లంబు శింబు నింబు - పిజ్జా వెర్సస్ గోంగూర - ఇండియా వెడ్స్ అమెరికా - ఆనందో బ్రహ్మ - పడిపోయా మరియు భజన బ్యాచ్ లను ఐడ్రీమ్ మీడియా రూపొందించింది.

'డార్లింగ్ మాలచిమి' విషయానికొస్తే - రొమాంటిక్ కామెడీస్ తీయడంలో మంచి పేరు తెచ్చుకున్న షార్ట్ ఫిలిం సిరీస్ డైరెక్టర్ అభిరామ్ పిల్లా దీన్ని రూపొందించారు.

ఇది ఐడ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి (Chinna Vasudeva Reddy of iDream Media) - విఐయు ఇండియా మధ్య ఇది తొలి వెంచర్. డిబి శ్రీను దీనికి సహ నిర్మాత.

హ్యాపీ గోయింగ్ లక్కీ ఆర్కిటెక్ట్ రామ్ - ఎన్నారై యువతి సిరి ఓ స్నేహితుల ఎంగేజ్ మెంట్ లో కలుస్తారు. ఈ సందర్భంగా తన మాజీ లవర్ మహాలక్ష్మికి సంబంధించిన ఎపిసోడ్ ఇద్దరి మధ్యా చర్చకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ. మనోజ్ కృష్ణ - ఆశ ఈ 'డార్లింగ్ మాలచిమి'లో ప్రధాన తారాగణం.

గత కొంతకాలంగా కంటెంట్ ప్రొడక్షన్ లో క్రియేటివిటీని ప్రోత్సహిస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఐడ్రీమ్ మీడియా - ఈ వెంచర్ తో మరో మెట్టు పైకి ఎక్కనుంది.

'డార్లింగ్ మాలచిమి' ష్టిల్స్ ని ఈ లింక్ ద్వారా వీక్షించవచ్చు: https://drive.google.com/open?id=1VZ4cF4NzwyMu1yNRvILVs_UchjRx9PWz

'డార్లింగ్ మాలచిమి' ట్రైలర్ ని ఈ లింక్ ద్వారా వీక్షించవచ్చు (Darling MaaLachimi Trailer): https://youtu.be/BP1GuZ2DpVg

'డార్లింగ్ మాలచిమి' సిరీస్ ని ఈ లింక్ ద్వారా విఐయు లో వీక్షించవచ్చు: https://www.viu.com/ott/in/en/telugu/playlist-darling_maalachimi-playlist-25808617

మరిన్ని వివరాలకు సంప్రదించండిః YouTube.com/iDreamMedia

 
Press release by: Indian Clicks LLC