Begin typing your search above and press return to search.

నాన్నతో పోలిస్తే ఫ్రస్టేషన్ వచ్చేస్తుంది - విష్ణు

By:  Tupaki Desk   |   5 Sep 2015 11:42 AM GMT
నాన్నతో పోలిస్తే ఫ్రస్టేషన్ వచ్చేస్తుంది - విష్ణు
X
తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో రాణించారాయన. 500కు పైగా సినిమాల్లో నటించి శిఖరంపై నిలబడ్డారు. ఇప్పటికీ ఆయన ఓ పాత్ర వేశారంటే దానికి తన నటనతో ప్రాణం పోస్తారు. అలాంటి గొప్ప నటుడి కొడుకులైన విష్ణు, మనోజ్ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడానికి దశాబ్దం నుంచి శ్రమిస్తున్నారు. హిట్లున్నాయి, ఫట్లున్నాయి. వీళ్లిద్దరి పెర్ఫా మెన్స్ విషయానికొచ్చినపుడు.. మోహన్ బాబుతో పోలిక రావడం సహజం. విష్ణు, మనోజ్ లకు మాత్రమే కాదు.. పెద్ద నటుల వారసులెవరికైనా ఈ పోలిక వస్తుంది. రామ్ చరణ్ కు చిరంజీవితో.. నాగచైతన్యకు నాగార్జునతో.. శ్రుతి హాసన్ కు కమల్ హాసన్ తో పోలిక వచ్చి తీరుతుంది.

ఐతే ఇలా పోల్చి చూసినపుడు వారసులకు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే వాళ్ల తండ్రులు లెజెండ్స్. వాళ్లను అందుకోవడం ఆషామాషీ విషయం కాదు. కాబట్టి పోల్చినపుడు వీళ్లు సరితూగరు. దీని గురించి విష్ణు దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘ఇలా పోల్చినపుడు నాకు చాలా ఫ్రస్టేషన్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరరూ మా నాన్నతో నన్ను పోల్చి.. ‘అతను వాళ్ల నాన్నలా డైలాగు చెప్పగలడడా? నటించగలడా? లేదు’ అనేస్తుంటారు. ఐతే అంత గ్రేట్ యాక్టర్ తో పోల్చడం ఏమాత్రం సరికాదు. నేను, మనోజ్ ఇంకా చిన్న వాళ్లమే. మేం మంచి నటులమో కాదో కాలమే నిర్ణయిస్తుంది. నేను మా నాన్న గారిలా డైలాగులు చెబితే మిమిక్రీ ఆర్టిస్టునో డబ్బింగ్ ఆర్టిస్టునో అవుతాను. నటనలో ఆయన్ని అనుకరించినా అలాగే ఉంటుంది. నాకంటూ ఓ సొంత స్టయిల్, ఐడెంటిటీ ఏముంటుంది. కాబట్టి ఈ పోలిక అన్నదే సరికాదు’’ అన్నాడు.