Begin typing your search above and press return to search.

ఆనందం హీరో.. ఏంటీ ఈ రొమాన్సులు

By:  Tupaki Desk   |   25 July 2016 7:30 AM GMT
ఆనందం హీరో.. ఏంటీ ఈ రొమాన్సులు
X
ఓ పదిహేనేళ్ల క్రితం ఆనందం మూవీలో రేఖతో తిట్టుకుంటూ కొట్టుకుంటూ లవ్ స్టోరీ నడిపించిన ఆనందం హీరో ఆకాష్.. ఇప్పటికీ తన మల్టీ ట్యాలెంట్ ను చూపిస్తూనే ఉంటాడు. గత ఐదేళ్లుగా అయితే.. సొంత డైరెక్షన్ లోనే సినిమాలు చేసేసుకుంటున్నాడు. జై ఆకాష్ అనే పేరుతో తెలుగు - తమిళ భాషల్లో ద్విభాషా చిత్రాలు చేస్తుంటాడు ఈ హీరో. ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సినిమాలే లేవు కానీ.. బాక్సాఫీస్ పై దండయాత్ర మాత్రం కంటిన్యూ అవుతోంది.

ప్రస్తుతం అమావాసై పేరుతో ఓ తమిళ్ చిత్రం రూపొందుతోంది. తెలుగులోనూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాష్ ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేసేస్తున్నాడు. సాక్షి.. శోగన్.. ప్రీతి సింగ్.. తాన్యా మౌర్య.. ముమైత్ ఖాన్ లతో ఈ మూవీలో రొమాన్స్ చేస్తాడట ఆకాష్. హారర్ కాన్సెప్ట్ పై తెరకెక్కే ఈ చిత్రం మ్యూజికల్ థ్రిల్లర్ అంటున్నాడు దర్శకుడు రాజేష్ సావంత్. ఆగస్టులో విడుదలకు ఈ మూవీ సిద్ధమవుతోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ అంటేనే.. ఆడియన్స్ ను అట్రాక్టివ్ చేసే పాయింట్. అలాంటిది ఏకంగా ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ అంటే థియేటర్లకు జనాలు తండోపతండాలుగా వచ్చేస్తారని మేకర్స్ ఫిక్స్ అయినట్లున్నారు. లేకపోతే ఆల్మోస్ట్ ఫేడవుట్ అయిపోయిన హీరోతో ఈ రేంజ్ లో రొమాన్స్ పండించే ప్రయత్నం చేయరు కదా!