Begin typing your search above and press return to search.

బాయ్‌ ఫ్రెండ్స్ తో హెబ్బా గ్లామర్ కేకలే

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:20 AM GMT
బాయ్‌ ఫ్రెండ్స్ తో హెబ్బా గ్లామర్ కేకలే
X
''నేను.. నా బాయ్‌ ఫ్రెండ్స్'' అనే మూవీతో ఇప్పుడు మరోసారి కిక్కివ్వడానికి రెడీ అవుతోంది హెబ్బా పటేల్. అమ్మడు ఆల్రెడీ ''కుమారి 21 ఎఫ్‌'' సినిమాలో ఇచ్చిన కిక్ ను ఇంకా మనోళ్లు మరచిపోలేదు. మరి ఈ సినిమాలో ఏం చేయబోతోంది?

కొత్త కుర్రాడు భాస్కర్ తీస్తున్న ''నేను నా బాయ్ ఫ్రెండ్స్'' సినిమాలో హెబ్బా పటేల్ లీడ్ రోల్ చేస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా అమ్మడు తన గ్లామర్ డోస్ తో ఫుల్ కిక్కిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే పూర్తి చేసిన మూడు పాటల్లో అమ్మడు ఆరేసిన అందాలు ఒక రేంజులో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు కుమారి 21 ఎఫ్‌ లో కేవలం ఒక యాంగిల్ మాత్రమే చూపించిన హెబ్బా.. ఈ సినిమాలో మాత్రం మత్తెక్కిస్తోందట. ముఖ్యంగా పాటల్లో రెచ్చిపోయిన తీరుతో మాస్ సెంటర్లలో వీలలతో పాటు గోల కూడా గ్యారెంట్ అంటున్నారు. ఏదేమైనా కూడా ప్రొడ్యూసర్ కు కాసుల పంట గ్యారంటీ అనమాట.

ఇకపోతే ఈ సినిమా టైటిల్ కేవలం 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' కాదు.. ''నాన్న.. నేను.. నా బాయ్ ఫ్రెండ్స్'' అనే పేరును ఫిక్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా అంతా నాన్న సెంటిమెంట్ అంట తెలుసా? కేకలే కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/