Begin typing your search above and press return to search.

సమంతతో నా పెళ్లి ఎప్పుడో అయ్యింది!

By:  Tupaki Desk   |   15 Dec 2018 11:38 AM GMT
సమంతతో నా పెళ్లి ఎప్పుడో అయ్యింది!
X
బాలీవుడ్‌ లో మొదలైన మీటూ ఉద్యమం ను సౌత్‌ లో చిన్మయి ఏ స్థాయికి తీసుకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ లెజెండ్‌ వైరముత్తు పై ఈమె చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీని కుదిపేశాయి. తెలుగు- తమిళంలో ఎంతో గుర్తింపు దక్కించుకున్న చిన్మయి పలు ఆసక్తికర విషయాల పై ప్రముఖ తెలుగు ఫిల్మ్‌ మేకర్‌ తమ్మారెడ్డి భరద్వాజా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చిన్మయి మీటూ ఉద్యమం తో పాటు సమంత తో తనకున్న సన్నిహిత్యం గురించి మాట్లాడినది.

చిన్మయి మాట్లాడుతూ.. సమంత తో నాకు ఎప్పుడో పెళ్లి అయ్యింది. మేమిద్దరం చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకున్నాం అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది. మీరిద్దరు పెళ్లి చేసుకుంటే మరి నాగచైతన్య పరిస్థితి ఏంటంటే.. నా భర్త రాహుల్‌ పరిస్థితే నాగచైతన్య పరిస్థితి కూడా అంటూ సరదాగా కామెంట్స్‌ చేసింది. మా నలుగురి మద్య ఏదో తెలియని కనెక్షన్‌ ఉంది. రాహుల్‌ మొదటి సినిమా- సమంత మొదటి సినిమా ఒక్కటే కావడంతో పాటు నాగచైతన్య సినిమాతోనే నేను తెలుగు లో డబ్బింగ్‌ ఆర్టిస్టు గా తెలుగు లో పరిచయం అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.

రాహుల్‌ నా వెంట పడి మరీ పెళ్లి కి ఒప్పించాడు. మొదటి సారి అడిగిన సమయంలో నేను తిరష్కరించాను. మరోసారి ఫ్లైట్‌ లో పెళ్లి చేసుకుందాం అడిగాడు, అప్పుడు అమ్మతో మాట్లాడి ఓకే చెప్పాను అంది. ఆడవారు ఎంతో కాలంగా లైంగిక వేదింపులను ఎదుర్కొంటున్నారు. వారందరికి మీటూ అనేది ఒక మంచి ఫ్లాట్‌ ఫార్మ్‌ గా తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అందుకే మీటూ లో భాగంగా నేను కొందరి పై విమర్శలు చేశాను అని, అవి నూటికి నూరు పాళ్లు నిజం అంటూ చెప్పుకొచ్చింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు నన్ను టార్గెట్‌ చేయడం బాధగా ఉన్నా మీటూ వల్ల ఎంతో మందికి మంచి జరిగిందని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.