Begin typing your search above and press return to search.

ఆ గాయమేంటి నానా ఛార్మి??

By:  Tupaki Desk   |   23 March 2018 7:32 PM GMT
ఆ గాయమేంటి నానా ఛార్మి??
X
ఒకసారి హీరోయిన్ కెరీర్ కు బ్రేక్ పడిందంటే ఆమె హీరోయిన్ గా మళ్లీ చేయడం కష్టమే. కానీ ప్రత్యేక పాత్రలో నటిస్తే మాత్రం కెరీర్ కు మరో విధంగా ప్లస్ అవుతుంది. అయితే ఛార్మి కౌర్ మాత్రం ఇప్పుడు అలాంటి ప్రయోగలేమి చేయడం లేదు. కేవలం పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ టీమ్ లో కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తోంది. పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ లో సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులను ఛార్మి దగ్గరుండి చూసుకుంటోంది.

అయితే అమ్మడు తన కెరీర్ గురించి ఎక్కువగా స్పందించడం లేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎలాంటి విషయాలని షేర్ చేసుకోవడం లేదు. కేవలం పూరీ జగన్నాథ్ కి సంబంధించిన సినిమా అప్డేట్స్ ని మాత్రమే ఇస్తోంది. ప్రస్తుతం మెహబూబా సినిమాకు ఛార్మి వర్క్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య బయట ఎక్కువగా కనిపించని ఛార్మి ఒక్కసారిగా ఎవరూ ఉహించని లుక్ తో దర్శనమిచ్చింది.

చేతికి కట్టుతో కనిపించడంతో ఛార్మీకి అసలేమైందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పైసా వసూల్ సినిమాలో కనిపించిన ముస్కాన్ సేథీ ఇటీవల హైదరాబాద్ లో ఒక ఫోటోషూట్ నిర్వహించగా ఆమెను కలవడానికి ఛార్మి వచ్చింది. అయితే ముస్కాన్ చాలా రోజుల తరువాత కలుసుకోవడంతో ఛార్మితో ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతే కాకుండా గెట్ వెల్ సూన్ మేడమ్ అని కూడా పోస్ట్ చేసింది. మరి ఛార్మీ గాయం వెనుక ఉన్న అసలు కథ ఏంటో?