Begin typing your search above and press return to search.

అగ్ర నిర్మాతతో ట్రిప్పులేస్తున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   2 Oct 2015 7:30 AM GMT
అగ్ర నిర్మాతతో ట్రిప్పులేస్తున్న హీరోయిన్
X
కేథరిన్ త్రెసా గుర్తుంది కదా. అమ్మడు తెలుగులో చేసిన సినిమాలన్నీ ఢమాల్ అనడంతో కోలీవుడ్ కు అడ్రస్ మార్చేసింది. ఇక్కడితో పోలిస్తే అక్కడ కెరీర్ కొంచెం బెటరే కానీ.. మరీ జోరుమీదైతే లేదీ ముంబయి భామ. ఐతే సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓ టాప్ ప్రొడ్యూసర్ తో ప్రేమాయణం ద్వారా మీడియాలో భలే హైలైట్ అయిపోతోంది కేథరిన్.

ఆమె రొమాన్స్ చేస్తోంది చిన్నా చితకా నిర్మాతతో కూడా కాదు. ఆయనో పెద్ద ప్రొడ్యూసర్ అట. ఈ మధ్యే ఆ ప్రొడ్యూసర్ తో కలిసి ఆమె ఫారిన్ ట్రిప్పుకి కూడా వెళ్లొచ్చిందట. ఆ ట్రిప్పుకి సంబంధించిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయంటున్నారు. ఐతే వాళ్లు ఇలా ట్రిప్పులేయడం కొత్తేమీ కాదంటున్నారు.

కార్తితో చేసిన ‘మద్రాస్’ తర్వాత కేథరిన్ కు తమిళంలో హిట్లేమీ లేవు. అయినప్పటికీ కేథరిన్ వరుసగా నాలుగు సినిమాలకు సంతకం చేసింది. ఐతే అవన్నీ అమ్మడి టాలెంటు గుర్తించిన ఇచ్చినవి కావు. అందులో మూడు సినిమాలకు ఆ ప్రొడ్యూసరే ఫైనాన్స్ చేస్తున్నాడట. కేథరిన్ కోసం తెర వెనుక ఉండి సినిమాలే నిర్మిస్తున్నాడంటే.. ఇది చాలా ఖరీదైన రొమాన్స్ అనే చెప్పాలి.